Healthhealth tips in telugu

100 రోగాలను నయం చేసే ఈ చెట్టు గురించి తెలుసుకుంటే డాక్టర్ అవసరమే ఉండదు

Gachakaya Chettu :గచ్చకాయ చెట్టు.. ఇప్పటి పిల్లలకు తెలియదు కానీ మన పెద్దవాళ్ళకు ఇది సుపరిచితమే.. ఈ చెట్టు కు ముళ్ల కాయలు ఉంటాయి. ఈ కాయల లోపల చిన్న చిన్న గోళీల వంటి గింజలు ఉంటాయి. ఈ గింజలతో చిన్నతనంలో ఆడపిల్లలు గచ్చకాయ ఆటలు ఆడితే.. మగపిల్లలు గోళీల ఆటలు ఆడేవారు. ఈ గచ్చకాయను రాయి మీద శరీరం మీద పెట్టి చుర్రుమని మంటపెట్టించి నవ్వుకున్న బాల్యం మన పెద్దల సొంతం.
gachhakaya
ఇక ప్రయోజనాల విషయానికి వస్తే…గచ్చకాయ చెట్టు పూల రసం డయాబెటిస్ ఉన్నవారు తీసుకుంటే నియంత్రణలో ఉంటుంది. అలాగే మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. గచ్చకాయ చెట్టు పుల్లలను ముళ్ళు లేకుండా తీసుకుని ఆ పుల్లలతో పళ్ళు తోముకుంటే చిగుళ్ళ నుండి రక్తస్రావం తగ్గటమే కాకుండా పంటికి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.
Joint Pains
గచ్చకాయ ఆకులను ఆముదంలో వేగించి కీళ్ల నొప్పులు,కాళ్ళ నొప్పులు,నడుం నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టుకడితే చాలు.. కీళ్ళవాపు, Joint Pain, మజిల్ పెయిన్ అన్నీ తగ్గుతాయి. గచ్చ ఆకులను, వేప ఆకులను ముద్దగా నూరి గజ్జి, తామర ,ఎర్ర దురద ఉన్నచోట రాస్తే అవి తగ్గుతాయి. ఈ ఆకులు అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి.
Piles Fruits
ఈ ఆకుల పేస్ట్ ని పైల్స్ సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి. గచ్చకాయ గింజలు కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తాయి. పిత్తాన్ని పెంచుతుంది. రక్త దోషాలను, వాపులను తొలగించి జీర్ణశక్తిని పెంచుతుంది. గింజలు రక్త వృద్ధికి తోడ్పడతాయి. మెదడుకు, కళ్ళకు, చర్మకాంతికి గచ్చకాయ గింజలను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.