ఈ హీరోని గుర్తు పట్టారా? ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Janaki Weds SriRam :సినీ ప్రపంచంలో హిట్ కొడితే అందలం ఎక్కిస్తారు. అదే ప్లాప్ అయితే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. కొంత మంది హీరోలు మొదట్లో హిట్స్ కొట్టిన ఆ తర్వాత పరాజయాలతో కనుమరుగు అయ్యిపోతున్నారు. అలాంటి హీరోలలో రోహిత్ ఒక్కడు. రోహిత్ అనగానే నారా రోహిత్ గుర్తుకు వస్తాడు. కానీ రోహిత్ అంటే 6 టిన్స్ సినిమాతో పరిచయం అయినా హీరో. ఆ సినిమా హిట్ అవ్వటంతో చిన్న సినిమాల దర్శకులకు వరంగా మారాడు రోహిత్. సొంతం,గర్ల్ ఫ్రెండ్,నవ వసంతం వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
రోహిత్ నటించిన జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా హిట్ కావటమే కాకుండా మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత చిరంజీవి నటించిన శంకర్ దాదా mbbs, శంకరుడదా జిందాబాద్ రెండు సినిమాలలోనూ మంచి పాత్రలను పోషించాడు. . రోహిత్ చివరి సినిమా మా అన్నయ్య బంగారం. ఈ సినిమాలో రాజశేఖర్ కి తమ్ముడిగా నటించాడు. ఈ సినిమా 2010 లో విడుదల అయింది. ఈ సినిమాల తర్వాత సినిమాల్లోనూ కన్పించలేదు అలాగే బయట ప్రపంచానికి కూడా దూరం అయ్యాడు. అసలు ఏమయ్యాడో ఎవరికీ తెలియలేదు.
2021లో వచ్చిన కళాకార్ చిత్రానికి శ్రీను బందెల దర్శకత్వం వహించగా.. రోహిత్ హీరోగా నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.ఇక ఆ తర్వాత మళ్లీ సినిమాకు దూరంగా ఉన్నారు రోహిత్. ఇటీవల జరిగిన మా ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కువగా కనిపించలేదు. ప్రస్తుతం రోహిత్ వ్యాపార రంగంలో బిజీ అయినట్లు తెలుస్తోంది.