సీరియల్ స్టార్స్ కార్తీక్,జగతి మధ్య రిలేషన్ ఏమిటో తెలుసా?
Karthika Deepam And Guppedantha manasu Serial :టివి సీరియల్స్ కి క్రేజ్ , ఫాలోయింగ్ వేరే లేవేల్లో ఉంది. అందునా కార్తీకదీపం సీరియల్ కి యమక్రేజ్ ఉంది. టాప్ వన్ రేటింగ్ తో దూసుకువెళ్ళుతున్న ఈ సీరియల్ అయ్యిపోయింది. అలాగే స్టార్ మాలో వస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ కి కూడా డిమాండ్ బాగానే ఉంది.
ఈ రెండు సీరియల్స్ లో నటిస్తున్న నటీనటులు తమ నటనతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. కార్తీక దీపం సీరియల్ తో నిరుపమ్ పరిటాల, హీరోయిన్ ప్రేమీ విశ్వనాధ్ లకు వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇక గుప్పెడంత మనసు సీరియల్ కూడా మంచి రేటింగ్ సాధిస్తోంది. ఇందులో రిషి, వసుధార, జగతి, మహేంద్ర క్యారెక్టర్స్ లో నటిస్తున్న ముఖేష్ గౌడ,రక్షా గౌడ,జ్యోతిరాయ్,సాయికిరణ్ లు తమ నటనతో అలరిస్తున్నారు.
కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ రోల్ లో నటిస్తున్న నిరుపమ్ పరిటాల, గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తున్న జ్యోతిరాయ్ ఇద్దరూ కల్సి 10ఏళ్ళక్రితం జి తెలుగులో ప్రసారమైన కన్యాదానం సీరియల్ లో నటించారు. మురళి,అర్చన క్యారెక్టర్స్ లో నటించి మెప్పించారు. మురళి,అర్చన ఇద్దరూ ప్రేమించుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన అర్చన శ్రీకర్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది.
శ్రీకర్ రోల్ వేసిన కళ్యాణ్ ప్రసాద్ కూడా రాధా మధు,కన్యాదానం,పెళ్లిపందిరి,కాంచనగంగ,అష్టాచెమ్మా అనే సీరియల్స్ లో చేసాడు. నిరుపమ్ పరిటాల, జ్యోతిరాయ్ కూడా పలు సీరియల్స్, సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.