1 గ్లాస్ తాగితే ఎండాకాలంలో వచ్చే కాళ్ళ నొప్పులు,వాపులు,కాళ్ళు లాగటం వంటివి అన్నీ మాయం
Summer Health Tips : ఎండాకాలంలో ఉదయం నుంచి పనులు చేసుకుంటూ ఉండటం వంటి కారణాలతో కాళ్ళు నొప్పులు పెట్టటం, కాళ్ళు వాపులు, కాళ్ళు లాగటం వంటి సమస్యలు సాదరణంగా మనలో చాలా మందిలో కనపడుతూ ఉంటాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా, వచ్చిన సమస్యలు తగ్గటానికి ఇప్పుడు చెప్పే వాటిని ఫాలో అయితే సరిపోతుంది.
దాహం అయినప్పుడు ఫ్రిజ్ లో నీటిని తాగకుండా మట్టి కుండలో పోసిన నీటిని తాగాలి. సబ్జా గింజలను నానబెట్టి తీసుకోవాలి. అలాగే మజ్జిగలో నిమ్మరసం,ఉప్పు కలిపి తాగాలి. సగ్గుబియ్యంను ఉడికించి తీసుకోవచ్చు. ఇవన్నీ శరీరంలో వేడిని తగ్గించటమే కాకుండా వేసవిలో వచ్చే సమస్యలను తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి.
ఇక బాగా లేతగా ఉన్న బూడిద గుమ్మడికాయను తీసుకొని ముక్కలుగా కట్ చేయాలి. అరకప్పు ముక్కలను మిక్సీలో వేసి ఒక కప్పు నీటిని పోసి బాగా మిక్సీ చేసి వడకట్టి మరికొన్ని నీటిని పోసి తాగాలి. అవసరం అనుకుంటే కొంచెం తేనె కలుపుకొని తాగవచ్చు. ఈ జ్యూస్ ఎండాకాలంలో వచ్చే కాళ్ళ నొప్పులు,వాపులు,కాళ్ళు లాగటం వంటి వాటిని తగ్గించటమే కాకుండా అధిక బరువును తగ్గిస్తుంది.
ఈ జ్యూస్ డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పిన వాటిని రెగ్యులర్ గా తీసుకుంటే ఈ ఎండాకాలం ఏ సమస్యలు లేకుండా చాలా హ్యాపీగా గడపవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.