జానకి కలగనలేదు సీరియల్ జ్ఞానాంబ రియల్ లైఫ్…ఎన్నికోట్ల అస్థి…?
Janaki Kalaganaledu Serial Gnanamba Raasi : బుల్లితెరపై జానకి కలగనలేదు సీరియల్ లో అమర్ దీప్ కి అమ్మగా నటిస్తున్న జ్ఞానాంబ ఎవరో కాదు ఒకప్పటి అందాల నటి రాశి. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి, తర్వాత హీరోయిన్ గా కూడా రాణించిన రాశి దాదాపు 84 సినిమాలకు పైగా నటించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెర సీరియల్స్ తో అలరిస్తున్న ఈమె అసలు పేరు విజయలక్ష్మి.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక రాశిగా మారింది. ఈమెకు మంత్ర,రాశి అనే నిక్ నేమ్స్ ఉన్నాయి. 1980 జూన్ 29న ఏపీలోని విజయవాడలో జన్మించిన ఈమెకు ప్రస్తుతం 43 ఏళ్ళు. మూవీ డైరెక్టర్ శ్రీనివాస గిరిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లిచేసుకున్న రాశి ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ పాప పేరు రిథిమా. 1986లో రిలీజైన మమతల కోవెల మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.
ఆరేళ్ళ ప్రాయంలోనే బాలనటిగా వచ్చి, సెలవుల్లో సినిమాల్లో నటించేది. అయితే ఇంకా ఎక్కువ ఆఫర్స్ రావడంతో స్కూల్ మానేసి మరీ సినిమాల్లో చేసేది. బాలగోపాలుడు,ఆదిత్య 369 వంటి పలు సినిమాల్లో బాలనటిగా అలరించింది. ఇక జగపతి బాబుతో కల్సి పెళ్లిపందిరి మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
శుభాకాంక్షలు,సుప్రభాతం,పండగ,ప్రేయసి రావే,దేవుళ్ళు,ఆమ్మో ఒకటో తారీఖు,దీవించండి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశి నటించింది.
తెలుగు,హిందీ,మలయాళం వంటి భాషల్లో పలు సినిమాలు చేసింది. 2003లో నిజం మూవీలో నెగెటివ్ షేడ్ రోల్ లో నటించింది. బాలనటిగా 5వేల రూపాయలు అందుకున్న ఈమె హీరోయిన్ గా 12లక్షలు తొలి సినిమాకు అందుకుంది. గిరిజా కళ్యాణం సీరియల్ తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్తస్తుతం జానకి కలగనలేదు మూవీలో నటిస్తోంది. వారానికి లక్ష రూపాయలు అందుకుంటోంది.
ఈమె నెట్ వర్త్ 60కోట్లు. హీరోల్లో చిరంజీవి, హీరోయిన్స్ లో సావిత్రి, శ్రీదేవి అంటే ఇష్టం. గోవా,పారిస్ అంటే ఇష్టమైన ప్రదేశాలు. జూబ్లీ హిల్స్ అపార్ట్ మెంట్ లో మూడున్నర కోట్ల విలువైన ఫ్లాట్ లో ఉంటోంది. ఈమెకు రెండు కారులున్నాయి. ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మాత్రమే.