పరగడుపున 2 ఆకులను నమిలి మింగితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?
Health Benefits Of Eating Pudina: పుదీనాలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మందికి పుదీనా వాసన నచ్చదు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పకుండా పుదీనాను తినటం ప్రారంభిస్తారు. మన పూర్వికుల కాలం నుండి పుదీనాను వాడుతున్నారు. అయితే పుదీనాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
పుదీనా ఆకులలో విటమిన్ ఎ, సి మరియు బి కాంప్లెక్స్, ఐరన్, పొటాషియం మరియు మాంగనీస్ వంటివి సమృద్దిగా ఉంటాయి. పుదీనా జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించి జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది. అంతేకాకుండా యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన పొట్టకు సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది.
పుదీనాలో మెంథాల్ అనే సమ్మేళనం ఉండుట వలన కడుపు ఉబ్బరం,గ్యాస్,మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా పొట్ట కండరాలను సడలిస్తుంది. సీజన్ మారటం వలన ఆస్తమా సమస్య ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వారు రెండు లేదా మూడు పుదీనా ఆకులను నమిలితే ఉపశమనం కలుగుతుంది.
పుదీనాలో ఉండే క్రిమినాశక లక్షణాలు, మెంథాల్ నోటిలో బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించి, నోటిని శుభ్రంగా ఉంచి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. పుదీనా ఆకులు మెదడుకు టానిక్ వలె పనిచేస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని మరియు మానసిక చురుకుదనాన్ని పెంచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి వాటిని తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒత్తిడి మరియు డిప్రెషన్ ని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు పుదీనా కషాయం చేసుకొని ప్రతి రోజు తాగితే 15 రోజుల్లో బరువు తగ్గటంలో తేడా గమనించి ఆశ్చర్యపోతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.