MoviesTollywood news in telugu

కృష్ణ కొడుకు రమేష్ బాబు జీవితం నాశనం కావడానికి అసలు నిజాలు

Super Star Krishna Son Ramesh babu:సూపర్ స్టార్ కృష్ణ కొడుకులుగా రమేష్ బాబు,మహేష్ బాబు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. మన తెలుగు సినీ పరిశ్రమలో స్టార్స్ వారి కొడుకులను వారసులుగా పరిచయం చేయటం సర్వ సాధారణంగా జరిగే విషయమే. ఆలా వచ్చిన వారసులు ఎంతవరకు కెరీర్ ని సాగించగలుగుతున్నారో అనేదే ప్రశ్న. మొదట్లో అవకాశాలు వచ్చినా ఆ తర్వాత వారి నటనను బట్టి అవకాశాలు ఉంటాయి.

ఆలా వచ్చిన కృష్ణ ఇద్దరి కొడుకుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. కృష్ణ సినిమా మోసగాళ్లకు మోసగాడు సినిమాలో చిన్నప్పటి కృష్ణగా నటించి రమేష్ బాబు సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసాడు.

ఆ తర్వాత ‘సామ్రాట్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బజారు రౌడీ,చిన్ని కృష్ణుడు, బ్లాక్ టైగర్,కలియుగ అభిమన్యుడు వంటి సినిమాలను వరుసగా చేస్తూ పరిశ్రమలో హీరోగా గుర్తింపు పొందాడు. అయితే తన తండ్రిలా సూపర్ స్టార్ కాలేకపోయాడు.

దానికి కారణం రమేష్ తన సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కృష్ణగారి అబ్బాయిగా తనకు వరుస అవకాశాలు వస్తాయని ధీమాతో కొంచెం అశ్రద్దతో కొన్ని వ్యసనాల కారణంగా తన గ్లామర్ ని,పర్సనాలిటీని నిలుపుకోకపోవటం వలన సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

అంతేకాకుండా తన దగ్గరకు వచ్చిన నిర్మాతలను డబ్బు కోసం ఇబ్బందులు పెట్టేవాడు. దాంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో నటుడిగా సినీ పరిశ్రమ నుండి దూరం అయ్యిపోయాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి మహేష్ తో అర్జున్,అతిధి సినిమాలను తెరకెక్కించాడు. అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఆ తర్వాత తీసిన దూకుడు మాత్రం నిర్మాతగా నిలబెట్టింది.

ఏది ఏమైనా సూపర్‌ స్టార్‌ కృష్ణ కొడుకు అయ్యి ఉండి, ఆ క్రేజ్‌ను రమేష్‌బాబు వాడుకోవడంలో విఫలం అయ్యాడు. రమేష్ బాబు జనవరి 2022 వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా మరణించారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకునే హీరోగా దూసుకు పోతున్నాడు. మరో వైపు పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వీటితో పాటు పలు బిజినెస్‌లలో కూడా మహేష్‌బాబు పెట్టుబడి పెడుతున్నాడు.