వారంలో 3 సార్లు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది
Dry Fruit milk shake : ఈ రోజుల్లో సమస్యలు రావటం అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలో వచ్చే అలసట,నీరసం వంటివి రాకుండా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
ఒక మిక్సీ జార్ లో పది పిస్తా పప్పులు,నాలుగు జీడిపప్పులు,అరకప్పు అరటిపండు ముక్కలు,మూడు గింజలు తీసిన ఖర్జూరాలు,రెండు యాలకులు వేసి మిక్సీ చేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె, గ్లాస్ పాలను వేసి మరల మిక్సీ చేసి గ్లాస్ లో పోసి తాగాలి. చల్లగా తాగాలని అనుకొనేవారు అరగంట ఫ్రిజ్ లో పెట్టుకొని తాగవచ్చు.
ఈ పాలను తాగటం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తప్రసరణ బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కండరాల నొప్పులు,తిమ్మిరి తగ్గుతాయి.
ఒత్తిడి,మానసిక ఆందోళన తగ్గటమే కాకుండా మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. నీరసం,అలసట,నిస్సత్తువ వంటివి తొలగి హుషారుగా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. వారంలో 3 సార్లు ఈ పాలను తాగితే చాలు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.