వేసవిలో పెరుగు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు…అసలు నమ్మలేరు
Curd Health benefits :పెరుగులో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పాలు కన్నా పెరుగు తొందరగా జీర్ణం అవుతుంది. అయితే బయట దొరికే రకరకాల ఫ్లేవర్డ్ పెరుగు కన్నా మన ఇంటిలో తయారుచేసుకున్న పెరుగు అయితే చాలా మంచిది.
కొవ్వు కరుగుతుంది
పెరుగును ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అంతేకాక పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా కొవ్వును కరిగించే గుణాలను కలిగి ఉంటుంది. అలాగే మలబద్దక సమస్య కూడా అదుపులో ఉంటుంది.
రక్తపోటు తగ్గుతుంది
అధిక రక్తపోటు ఉన్నవారు తప్పనిసరిగా ఆహారంలో పెరుగు చేర్చుకోవాలి. పెరుగులో ఉండే పొటాషియం కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు లక్షణాలు తగ్గించటంలో సహాయపడుతుంది.
ఆకలి కోరికలను తగ్గిస్తుంది
రోజువారీ ఆహారంలో పెరుగు చేర్చటం వలన ఆహారాల మీద కోరికలు తగ్గటమే కాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాక కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
ప్రశాంతత కలుగుతుంది
పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా కారణంగా మెదడు స్ట్రాంగ్ గా ఉండటమే కాకుండా కాన్ సంట్రేషన్ కూడా పెరుగుతుంది.
డిప్రెషన్ తగ్గుతుంది
పెరుగులో విటమిన్స్ మరియు మినిరల్స్ సమృద్ధిగా ఉండుట వలన నాడీవ్యవస్థకు బాగా సహాయపడతాయి. పెరుగులో ఉండే బి 12 ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతాయి.
నడుము చుట్టు చేరే కొవ్వు తగ్గుతుంది
పెరుగు తినటం వలన జీవక్రియ రేటు పెరిగి నడుము చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. పెరుగును ప్రతి రోజు తీసుకుంటే నడుము చుట్టూ కొవ్వును కారణం అయినా హార్మోన్స్ ఉత్పత్తిని తగ్గించటంలో సహాయపడుతుంది.