అల్లు అర్జున్, NTRతో నటించిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?
Tollywood Heroine sheela kaur: హీరో నవదీప్ నటించిన సీతాకోకచిలుక మూవీలో నటించి,టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ షీలా కౌర్ ఆతర్వాత పలువురి నటులతో కల్సి నటించింది. ముఖ్యంగా భాస్కర్ డైరెక్షన్ చేసిన పరుగు మూవీలో అల్లు అర్జున్ తో జతకట్టి అలరించింది. అందం,అభినయం గల ఈ అమ్మడు తెలుగులో తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లతో నటించిన షీలా కౌర్ ఆతర్వాత పరమవీర చక్ర మూవీలో నందమూరి బాలయ్యతో కల్సి నటించింది. ఆతర్వాత మళ్ళీ కనిపించలేదు. అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లాడిన ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది.
హీరోయిన్ గా మంచి నటన తో ఆకట్టుకుని,ముఖ్యంగా పరుగు మూవీలో తన నటనతో అదరగొట్టిన కౌర్ ఇప్పుడు భర్త వ్యాపారాల్లో కూడా భాగం పంచుకుంటూ,ఇంట్లో పనులు కూడా చక్కబెట్టుకుంటోందని టాక్.