MoviesTollywood news in telugu

మహేష్ పెళ్ళిలో ట్విస్ట్ తెలిస్తే…ఏమి జరిగిందో తెలుసా…?

Super Star Mahesh Babu:మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం అందరికీ తెలుసు. మరి వీరి మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది పెళ్లి సంగతులేంటి లాంటి వివరాలను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు ఈ జంట. ఇప్పుడా విశేషాలను స్వయంగా చెప్పాశారు మహేష్ నమ్రతలు. ‘వంశీ’ మూవీలో కలిసి నటించిన మహేష్ నమ్రత.

ఆ మూవీ ముహూర్తం పూజలోనే తొలిసారి కలుసుకున్నారట. ‘అప్పటికి మా మధ్య ఎలాంటి అభిప్రాయాలు లేవు.సినిమా పూర్తయ్యే సమయానికి ఒకరినొకరు ఇష్టపడ్డాం’ అని చెప్పింది నమ్రత. ఇక పెళ్లి రోజు సంగతి అయితే.. ‘అతడు సినిమా కోసం రాత్రంతా షూటింగ్ చేసి.. పెళ్లి చేసుకునేందుకు వెళ్లాను’ అంటున్నాడు మహేష్. ‘పెళ్లి రోజుకు వారం ముందు వరకూ చాలా బిజీగా ఉన్నాను. నిజంగా కొంచెం కూడా టైం లేదు. మా అక్క బావగారు పేరెంట్స్ అన్ని పనులు చూసుకున్నారు’ అని చెప్పింది నమ్రత.

భారీ ఎత్తున పెళ్లి చేసుకోవడం కంటే.. దగ్గర కుటుంబసభ్యుల మధ్య కలిసి చేసుకుంటే బాగుంటుందని ఈ జంట నిర్ణయించుకున్నారట. ఎక్కువ సందోహం మధ్య మ్యారేజ్ చేసుకుంటే.. కొన్ని అమూల్యమైన క్షణాలను మిస్ అవుతాయని.. అందుకే కుటుంబసభ్యులతోనే వివాహం చేసుకున్నామని చెప్పారు.

వీరి పెళ్లి చేసిన పురోహితులు తిరుపతి నుంచి వచ్చినా.. నమ్రత తరపువారికి.. ప్రతీ మంత్రం అర్ధాన్ని హిందీలో వివరించి చెప్పారట. ఆ మధుర క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది నమ్రత. పని ఒత్తిడిని బయటే మర్చిపోయి ఇంటికి రావడం మహేష్ స్పెషాలిటీ అని.. ఇంట్లో అతను సూపర్ స్టార్ కాదని.. కేవలం తానూ మంచి భర్త, మంచి తండ్రి మామూలు మనిషి అంటూ చెప్పుకొచ్చింది నమ్రతా.