గ్రహణం రోజున గర్భిణీలు ఈ పనులు చేయకూడదు…ఎందుకంటే..
Surya Grahan 2023:2023 లో మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన వస్తోంది. ఉదయం 7.04 నిమిషాల నుండి మధ్యాహ్నం 12.29 వరకు ఉంటుంది. గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మన పెద్దవారు చెప్పుతూ ఉంటారు. గ్రహణ సమయంలో కొన్ని పనులను చేయొద్దని మన పెద్దవారు చెబుతూ ఉంటారు. అలాగే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు అని కూడా చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీల విషయానికొస్తే గ్రహణాల కారణంగా పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది. దీనికి శాస్త్రీయంగా ఎటువంటి నిరూపణ లేకపోయినా మనలో చాలామంది ఈ విషయాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే గ్రహణ సమయంలో బయటకు వెళ్ళవద్దు అని చెబుతూ ఉంటారు.
గ్రహణం ప్రారంభం నుంచి పూర్తి అయ్యే వరకు ఇంటి లోపల ఉండాలని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా పడుకోకుండా మెలకువగా ఉండాలని చెబుతారు. గ్రహణం సమయంలో సూర్యకిరణాలు లోపలికి రాకుండా తలుపులు అన్ని మూయాలి. గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెరలు బ్లేడ్లు వంటివి ఉపయోగించ కూడదు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఆహారం వండుకుని మాత్రమే తినాలి.