బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా 1 కప్పు తింటే మెదడు చురుగ్గా పనిచేయటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు
Healthy breakfast Recipe In Telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం సమయంలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి రెండు కప్పుల పాలను పోయాలి. ఆ తర్వాత 2 స్పూన్ల పటికబెల్లం వేయాలి. 5 నిమిషాలు పాలు మరిగాక అరకప్పు బాదం పప్పు పొడి వేయాలి. ఆ తర్వాత పావుకప్పు ఒట్స్ వేయాలి. 5 నిమిషాలు అయ్యాక ఒక స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలను వేయాలి. పొయ్యి ఆఫ్ చేసి బాగా కలపాలి.
ఆ తర్వాత పావు స్పూన్ దాల్చినచెక్క పొడి వేయాలి. ఒక ఆపిల్ పండును తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఒక అరటి పండు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక కప్పులో పోసుకొని తీసుకోవాలి. ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.
అంటే బ్రేక్ ఫాస్ట్ కి బదులుగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపకశక్తి సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ఉదయం సమయంలో తీసుకోవటం వలన అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా రోజంతా హుషారుగా పనులు చేసుకోవటానికి సహాయపడుతుంది.
అలాగే శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. సీజనల్ గా వచ్చే దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. అధిక బరువు ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయటానికి బదులుగా తీసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.