Healthhealth tips in telugu

ఈ పండు తిన్న తర్వాత నీటిని తాగితే ఏమి అవుతుందో తెలుసా ?

watermelon : ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఎండాకాలంలో దాహం తీర్చుకోవడానికి చాలా మంది పుచ్చకాయ తింటూ ఉంటారు. ఇందులో అనేక రకాల పోషకాలు.. విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా.. డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అలాగే చర్మాన్ని పొడిబారకుండా…హైడ్రేట్‏గా ఉండేలా చేస్తుంది. అయితే పుచ్చకాయ తిన్న తరువాత నీటిని తాగకూడదు.

ఇలా నీటిని తాగితే ఏమి జరుగుతుందో చూద్దాం. పుచ్చకాయలో 92 శాతం నీరు., ఆరు శాతం చక్కెర ఉంటుంది. అందువలన పుచ్చకాయ తిన్నప్పుడు శరీరానికి అవసరమైన నీరు అందుతుంది. పుచ్చకాయ తిన్న తర్వాత నీటిని తాగితే శరీరంలో నీటి శాతం పెరిగి బరువెక్కుతుంది. అలాగే విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశం ఉంది.

తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చి డిహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే పుచ్చకాయ తిన్న తరువాత నీటిని తాగితే జీవక్రియల్లో ఇబ్బందులు వచ్చి శారీరకంగా బలహీనంగా మారుతారు. శరీరంలోని ఎలెక్ట్రోలైట్స్ బాలన్స్ అయ్యి.. శరీరంలోని కణాలను నాశనం చేస్తుంది.
gas troble home remedies
ఇంకా శారీరక బలహీనతకు గురిచేస్తుంది. అందుకే పుచ్చకాయ తిన్న తరువాత వెంటనే నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.