బొప్పాయి ముక్కలను నీటిలో మరిగించి తాగితే ఏమి అవుతుందో తెలుసా…?
Benefits Of Papaya Water In Telugu : ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. బొప్పాయిలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఉదయం పరగడుపున బొప్పాయి నీటిని తాగితే ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి నీటిని ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం.
బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు సమృద్దిగా ఉన్నాయి. బాగా పండిన బొప్పాయిని తీసుకొని శుభ్రం కడిగి పై తొక్క తీసి గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి బొప్పాయి ముక్కలను వేసి 5 నిమిషాలు ఉడికించి ఆ నీటిని వడకట్టి సాదారణ నీటిని తాగినట్టే తాగవచ్చు.
ఈ నీటిని ఏ సమయంలోనైనా తాగవచ్చు. అయితే ఉదయం పరగడుపున తాగితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బరువును తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
అలాగే ఉదయాన్నే బొప్పాయి నీటిని తీసుకోవటం వలన ప్రేగును శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే పాపైన్ ఎంజైమ్‌లు పేగులకు చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా పేగులోని టాక్సిన్‌లను తొలగిస్తాయి. బొప్పాయిని నీటిలో ఉడికించినప్పుడు పపైన్ చెక్కుచెదరకుండా ఉంటుంది. పపైన్ కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. మరియు ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బొప్పాయిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు వేడిని తట్టుకోగలవు, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బొప్పాయి నీటిలో ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ మరియు ఫ్లేవనాయిడ్స్ కారణంగా బలమైన యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది ప్రోస్టేట్ మరియు రొమ్ము క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
మైగ్రేన్ మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. బొప్పాయి నీటిని ప్రతి రోజు తీసుకోవచ్చు. అయితే తాజాగా తయారుచేసుకొని తాగితే మంచిది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బొప్పాయి నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి. కాస్త శ్రద్ద పెడితే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.