రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ రుద్ర గురించి ఈ విషయాలు తెలుసా…?
Rajeshwari vilas coffee club serial hero rudra real life: బుల్లితెరలో వచ్చే సీరియల్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ సీరియల్స్ లో నటించే నటీనటులకు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వారి గురించి తెలుసుకోవటానికి ప్రతి అభిమాని సిద్దంగా ఉంటారు.
December 2022 లో ప్రారంభం అయినా ఈ సీరియల్ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ పొందింది. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్ లో నటిస్తున్న రుద్ర గురించి తెలుసుకుందాం. రుద్ర పాత్రలో Akarsh Byramudi నటిస్తున్నాడు. Akarsh పున్నాగ,అత్తారింట్లో అక్కచెల్లిళ్ళు,అగ్ని పరీక్ష వంటి సీరియల్స్ లో నటించాడు.
కర్ణాటకలో పుట్టి పెరిగిన Akarsh చదువు అంతా కూడా కర్ణాటకలోనే సాగింది. Akarsh కి ఒక అన్నయ్య ఉన్నాడు. Akarsh కి చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి కాగానే కన్నడ టివీ రంగంలోకి అడుగు పెట్టాడు. కన్నడ సీరియల్స్ లో నటించి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు బుల్లితెరకు పున్నాగ సీరియల్ తో ఎంట్రీ ఇచ్చాడు.