Healthhealth tips in telugu

బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్ తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా?

Apple Health benefits In telugu : ఉదయం సమయంలో తీసుకొనే ఆహారం మన ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఆ సమయంలో తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఆపిల్ లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని చెప్పుతూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక ఆపిల్ తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెప్పుతున్నారు.

ఎందుకంటే ఆపిల్‌లో డైటరీ ఫైబర్, పెక్టిన్ పుష్కలంగా ఉంటాయి, ఇది దాని పై తొక్కలో ఉంటుంది. చాలా మందికి నిద్ర సరిగా లేకపోవటం లేదా ఆలస్యంగా తినే అలవాట్ల కారణంగా జీర్ణ సమస్యలు ఉంటాయి కాబట్టి, ఉదయం లేవగానే ఆపిల్ తినడం మంచిది. అందువల్ల, ఉదయాన్నే ఆపిల్ తినడం వల్ల మీ ప్రేగు కదలికలు ఇతర పండ్ల కంటే మెరుగ్గా ఉంటాయి.
Acidity home remedies
ఆపిల్ లో ఉండే పెక్టిన్ లాక్టిక్ ఆమ్లాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అందులో ఉండే బ్యాక్టీరియా పెద్దప్రేగులో మెరుగ్గా పనిచేయటానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్ లను వదిలించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది.

ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు ఉండుట వలన నోటిలో బ్యాక్టీరియాను తొలగించి నోటి ఆరోగ్యాన్ని రక్షించటంలో సహాయపడుతుంది. ఆపిల్ లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది.
Weight Loss tips in telugu
అదే రాత్రి లేదా సాయంత్రం యాపిల్స్ తింటే, ఈ ప్రో-డైజెస్టివ్ పండు మీకు వ్యతిరేకంగా మారుతుంది. అలాగే ప్రేగుల పనితీరుపై లోడ్ ఎక్కువ అవుతుంది. అంటే రాత్రిపూట ఆపిల్‌ తింటే గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాక తెల్లవారుజామున తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తింటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.