చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే వజ్రం లాంటి ఆహారం…ముఖ్యంగా వెజిటేరియన్స్ కి
Meal maker benefits in telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితి కారణంగా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మీల్ మేకర్ ను సోయా చుంక్స్ అని కూడా పిలుస్తారు. మీల్ మేకర్ తో అనేక రకాల వంటకాలు చేసుకుంటారు. మీల్ మేకర్ ను మాంసం తినని వారికీ మంచి ప్రత్యామ్న్యాయం అని చెప్పవచ్చు. మాంసంలో ఉన్న పోషకాలు ఈ మీల్ మేకర్ లో ఉంటాయి. మీల్ మేకర్ లో ఎన్నో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మీల్ మేకర్ లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల శాఖాహారం తినేవారికి ఈ ప్రోటీన్ చాలా సహాయాపడుతుంది.మీల్ మేకర్ లో కాల్షియం
సమృద్ధిగా ఉంటుంది. దీనిలో ఉండే ప్రోటీన్ కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది,గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లే మేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి.
అంతేకాక ఐసోఫ్లేవోన్లు మూలం ఉంటుంది. ఇవి మంటను తగ్గించటంలో సహాయపడతాయి.శాకాహాకరులకు ప్రోటీన్స్ (మాంసకృత్తులు) అందించే మంచి ఆహారం. పాలు, మాంసం, గుడ్లు కంటే మీల్ మేకర్ లోనే ఎక్కువ ప్రొటీన్సు ఉంటాయి. శరీర కణజాలాల నిర్మాణానికి అవసరమై అమైనో యాసిడ్లు మీల్ మేకర్ లో లభిస్తాయి.
మీల్ మేకర్ లో లభించే మేలురకం ప్రొటీన్సు అన్ని వయసుల వారికి అవసరం. పిల్లలలో ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, ఎముకల అభివృద్ధికి ఇవి ప్రయోజనకారిగా ఉంటాయి. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడుతుంది. అధిక బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది. మోనోపాజ్ వయసులో ఉన్న మహిళలలో ఎముకలు గుల్లబారడాన్ని అరికట్టేందుకు మీల్ మేకర్ తీసుకోవటం తప్పనిసరి. వారంలో ఒకసారి ఐనా తప్పనిసరిగా మీల్ మేకర్ తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. కాబట్టి మీల్ మేకర్ ని తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.