Healthhealth tips in telugu

ఎండాకాలం చల్లదనం కోసం నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి

Lemon juice side effects In telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరూ నిమ్మరసం తాగుతున్నారు. అయితే నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసుకుందాం. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన పుల్లని రుచిని కలిగి ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ పంటి ఎనామిల్ మీద ప్రభావంచూపుతుంది .
lemon benefits
పంటి మీద ఉన్న ఎనామిల్ పళ్లను రక్షిస్తుంది. అలాగే దంతాల లైఫ్ ని పెంచుతుంది ఎనామిల్. దంతాలకు ఎనామిల్ అనేది ఒక రక్షణ కవచం అని చెప్పవచ్చు. దంతాల మీద ఎనామిల్ సరిగ్గా లేకపోతె దంతాలు పుచ్చటం మరియు అరిగిపోవటం వంటివి జరుగుతాయి. దంతాలపై ఎనామిల్ బాగా ఉన్నంత కాలం దంతాల సమస్యలు ఏమి రావు.

ఎనామిల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎంత వేడిని అయినా తట్టుకుంటుంది. అలాంటిది ఎనామిల్ ని నిమ్మరసం పాడు చేసేస్తుంది. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఎనామిల్ ని తినేస్తుంది. దాంతో సమస్యలు రావటం ప్రారంభం అవుతుంది. నిమ్మరసం ను డైరెక్ట్ గా తీసుకుంటే ఎనామిల్ తింటుంది. కొంత మంది నిమ్మ బద్ద మీద ఉప్పు,కారం వేసుకొని తింటూ ఉంటారు.

అలాంటి వారికీ నిమ్మరసం డైరెక్ట్ గా పంటి మీద పడుతుంది. అప్పుడు నిమ్మరసంలో ఉన్న సిట్రిక్ యాసిడ్ పంటి మీద ఉన్న ఎనామిల్ ని దెబ్బతీస్తుంది. ఎప్పడు ఆలా డైరెక్ట్ గా నిమ్మరసాన్ని వాడకూడదు. నిమ్మరసం పంటికి తగలగానే జివ్వుమని లాగుతుంది. ఆలా జివ్వుమని అంటే నిమ్మరసం ప్రభావం పంటి మీద పడినట్టే. నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని పళ్ళకు తగలకుండా తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.