Healthhealth tips in telugu

బొప్పాయితో వీటిని కలిపి తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా…విషాన్ని తిన్నట్లే..ఎలా…?

Dangerous Combination With Papaya: బొప్పాయిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయిలో ఉన్న పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. అయితే బొప్పాయితో కలిపి కొన్ని పదార్థాలను తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బొప్పాయిలో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ఏ,సి, బి వంటివి సమృద్ధిగా ఉంటాయి.

బొప్పాయిలో పపైన్ అనే ఎంజాయ్ సమృద్ధిగా ఉండటం వలన గాయాలను నయం చేయటంలో సహాయపడుతుంది. బొప్పాయిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. బొప్పాయితో నిమ్మరసం కలిపి తీసుకుంటే అది విషపూరితం అవుతుంది. ఇది రక్తహీనత, హిమోగ్లోబిన్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తుంది.

అలాగే బొప్పాయి తిన్న తర్వాత నారింజ, కివి వంటి పుల్లని పండ్లను తినకూడదు. పెరుగు,బొప్పాయిని కలిపి తీసుకోకూడదు. ఈ రెండు ప్రభావాలు విభిన్నంగా ఉంటాయి. బొప్పాయిని లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే బొప్పాయిలో ఉండే పాపిన్ అనే ఎంజైమ్ వాపు, తల తిరగడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటి అలర్జీలను కలిగిస్తుంది. ఎలర్జీ సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయికి దూరంగా ఉంటేనే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.