క్యారెక్టర్ యాక్టర్స్ గా మారిన సీనియర్ హీరోయిన్స్ పారితోషికం ఎంతో తెలుసా?
Senior actress remuneration :ఒకప్పుడు హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగి, ఆతర్వాత పెళ్ళిచేసుకుని సెటిల్ అయ్యేవారు. కొందరు ఏవో అమ్మా, అత్త, బామ్మ పాత్రలతో నెట్టుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. వయస్సు మళ్ళిన హీరోయిన్స్ కేరక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయి భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.
హీరోయిన్స్ కి ధీటుగా రాణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అత్త,అమ్మ క్యారెక్టర్స్ ని వీళ్ళకోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. దాంతో వాళ్లకి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోతోంది. అత్తారింటికి దారేది సినిమాలో నదియా,బాహుబలి లో రమ్యకృష్ణ ఇలా పలు సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ కీలకంగా మారాయి.
ఈవిధంగా రాణిస్తున్న సీనియర్ హీరోయిన్స్ కి వచ్చే రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటోందని చెప్పాలి. బాహుబలి చిత్రాలతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రమ్యకృష్ణ రోజుకి రెండున్నర లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. పలు భాషా చిత్రాల్లో మదర్ కేరక్టర్స్ వేస్తున్న నదియా రోజుకి రెండు లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటోందని టాక్.
తెలుగులో సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ ఇప్పుడు అమ్మ,వదిన పాత్రలలో ఒదిగిపోతుంది. పది రోజుల షూటింగ్ కి 20లక్షలు,ఒకవేళ పదిరోజులు దాటితే రోజుకి లక్ష రూపాయలు తీసుకుంటున్నారట. ఇక తల్లి పాత్రలతో రాణిస్తున్న నటి పవిత్ర లోకేష్ ఒక్కరోజుకి 60వేల రూపాయలకు తగ్గకుండా పారితోషకం అందుకుంటున్నారట.
అదేవిధంగా ఒకప్పుడు హీరోయిన్ రాణించిన రాశి ఇప్పుడు తల్లిపాత్రల కోసం రోజుకి 75వేల వరకూ అందుకుంటున్నట్లు టాక్. వివిధ భాషల్లో మదర్ కేరక్టర్స్ తో రాణిస్తున్న రోహిణి రోజుకి 50నుంచి 60వేల వరకూ రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. మదర్ కేరక్టర్స్ చేస్తున్న ప్రగతి రోజుకి 50వేలు అందుకుంటోందని చెబుతున్నారు. పలు భాషల్లో తల్లి పాత్రలు వేస్తున్న శరణ్య ఒక్కో సినిమాకు 20లక్షలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అయితే రేవతి తల్లి పాత్రలకు సినిమాకి 15లక్షలు తీసుకుంటున్నారట. ఇక ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఇప్పుడు వేస్తున్న అమ్మ, అత్త పాత్రలకు అక్షరాలా రెండు కోట్ల రూపాయలు అందుకుంటోంది. అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మధుబాల ఇప్పుడు అమ్మ పాత్రలకోసం రోజుకి 75వేల రూపాయలు అందుకుంటోంది.