MoviesTollywood news in telugu

బొంబాయి సినిమా గురించి ఈ నమ్మలేని నిజాలు మీకోసమే…వెంటనే చూసేయండి

Maniratnam Bombay movie telugu : ఫ్యామిలీ,కామెడీ సినిమాల ధోరణి నుంచి ఆనాటి సామాజిక పరిస్థితులను జోడించి వాస్తవ ఘటనల ఆధారంగా అద్భుత కథనంతో మణిరత్నం మూవీస్ తీశారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సిన మూవీ బొంబాయి 1995మార్చి 10న రిలీజ్ అయింది. హుబ్లీ,ఉత్తర కర్ణాటక, హైదరాబాద్,ఇలా పలు ప్రాంతాల్లో థియేటర్లపై దాడి కూడా జరిగింది.

అంతలా ఈ మూవీ ప్రభావితం చేసింది. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ వర్గం గొడవ పెట్టినా సరే, మణిరత్నం మ్యాజిక్ ముందు పనిచేయలేదు. 1992డిసెంబర్ 6న బాబ్రీ ఘటన తర్వాత రెండు ముఖ్యమైన వర్గాల మధ్య గొడవ,ఇబ్బందికర పరిణామాలు ఉండేవి. ముంబయిలో జరిగిన అల్లర్ల లో చావ్లా అనే దివ్యంగురాలు కూడా చనిపోవడంతో మరింత అల్లర్లు రేగాయి.

ముంబయిలో సాగిన అల్లర్ల సాకుగా సంఘ వ్యతిరేక శక్తులు సాగించిన విధ్వంసం నేపథ్యంలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అసాంఘిక శక్తుల మారణహోమానికి అమాయకులు బలయ్యారు. అప్పట్లో దొంగ దొంగ సినిమా పనుల్లో ఉన్న డైరెక్టర్ మణిరత్నం ను ఈ ఘటనలు చాలా బాధించాయి. కేరళకు చెందిన ఎం టి నాయర్ ను కథ,కథనం సిద్ధం చేయమన్నారు.

ఆలస్యం కావడంతో తానే కూర్చుని కథ రెడీ చేసుకున్నారు. మొదట్లో తమిళంలో తీయాలని భావించి హీరోయిన్ గా మనిషా కొయిరాలాకు తీసుకున్నారు. హీరోగా విక్రమ్ ని అనుకుంటే,అప్పటికే వేరే సినిమా కోసం గెడ్డం పెంచడం ,అది తీయడానికి వీల్లేదని అనడంతో రోజాలో చేసిన అరవింద్ స్వామిని హీరోగా తీసుకున్నారు.

సినిమాటోగ్రాఫర్ గా రాజు మీనన్ ని సెలక్ట్ చేసారు. ప్రేమ సన్నివేశాలు వర్షంలో తీయాలన్న యోచన మీనన్ కి వచ్చిందే. బాబ్రీ ఘటన వీడియోలను చూపించడానికి సెన్సార్ బోర్డు ఒప్పుకోకపోవడంతో పత్రికల్లో వచ్చిన వార్తలనే చూపించారు. సెన్సార్ బోర్డు సభ్యులకు, మహారాష్ట్రలోని పలువురు కీలక రాజకీయ నేతలకు ప్రివ్యూ వేసి చూపించారు.

టినూ ఆనంద్ పాత్ర బాల్ థాకరే ను పోలి ఉండడంతో చాలా కత్తెరలు పడడంతో చాలా తక్కువ సేపు ఈ పాత్ర కన్పిస్తుంది. ఇక బిగ్ బి కి చెందిన ఏబీసీ కార్పొరేషన్ 2న్నర కోట్లు చెల్లించి హిందీ హక్కులు సొంతం చేసుకుంది. 1995మార్చి 10న తెలుగు,హిందీ,తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. ఆచారాలు సంప్రదాయాలు పాటించే ఫ్యామిలీ కి చెందిన శేఖర్ ముంబయిలో జర్నలిస్టుగా చేస్తూ ఉంటాడు.

ఒక ఊరు వచ్చిన శేఖర్ అక్కడ షైలా భాను అనే ముస్లిం యువతిని ప్రేమిస్తాడు. మొదట్లో దూరం పెట్టినా తర్వాత అతడిలో నిజాయితీని నమ్మి ,తాను కూడా ప్రేమిస్తుంది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవు. పైగా గొడవలు జరుగుతాయి. అయినా సరే, షైలా.. శేఖర్ తో ముంబయి వచ్చేస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్ళకు వీరికి ఇద్దరు పిల్లలు పుట్టడం, ఈలోగా ఇరు కుటుంబాల్లో కోపతాపాలు తగ్గి ముంబయి రావడం జరుగుతాయి.

అదేసమయంలో మతఘర్షణలు జరగడం,ఇందులో ఎవరు నష్టపోయారు అనేది ఈ చిత్ర కథ. అరవింద్, మనిషా ల నటన, నాజర్, కిట్టుల నటన అలాగే రాళ్ళపల్లి ఆందోళనకారులకు ఎదురు తిరగడం అన్నీ రక్తి కట్టాయి. ఇక చిన్న పిల్లల నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. అన్నింటికీ మించి ఏ ఆర్ రెహ్మన్ సంగీతం విశేషం గా అలరించింది. సాంగ్స్ సూపర్భ్ . ఎన్నో అవార్డులు వచ్చాయి. ఉత్తమ జాతీయ సమగ్రత అవార్డుగా నర్గీస్ దత్ అవార్డుని మణిరత్నం అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో కూడా గాలా అవార్డు సొంతం చేసుకుంది. తమిళంలో తీసిన ఈ మూవీ తెలుగు,హిందీలలో డబ్బింగ్ చేసినా ఎక్కడా ఆ ఆనవాళ్లు కనిపించవు.