MoviesTollywood news in telugu

కృష్ణ ముకుంద మురారి సీరియల్ మురారి గురించి ఈ విషయాలు తెలుసా…?

Krishna mukunda murari serial actor murari real life:కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రారంభం అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణను సొంతం చేసుకుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ లో నటిస్తున్న మురారి గురించి తెలుసుకుందాం.

మురారి అసలు పేరు గగన్ చిన్నప్ప. కర్ణాటకలో పుట్టి పెరిగిన గగన్ చదువు మొత్తం కర్ణాటకలోనే సాగింది. గగన్ కి చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉండటంతో చదువు పూర్తీ కాగానే కన్నడ పరిశ్రమ వైపు అడుగులు వేసి సీరియల్స్, సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కన్నడలో తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

గగన్ మొదటి సారిగా కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. తోలి సీరియల్ తోనే తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కన్నడలో త్వరలో ప్రారంభం కాబోతున్న సీతారామం సీరియల్ లో కూడా నటిస్తున్నాడు. గగన్ కి తెలుగులో కూడా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.