ఎన్నెన్నో జన్మల బందం సీరియల్ వేద గురించి ఈ విషయాలు తెలుసా…?
Ennenno janmala bandham serial heroine veda real life:ఎన్నెన్నో జన్మల బందం సీరియల్ ప్రారంభం అయినా చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులకు కూడా మంచి పేరు రావటమే కాకుండా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఎన్నెన్నో జన్మల బందం సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న వేద అద్భుతమైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. వేద అసలు పేరు Debjani Modak.ఇమే పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. చదువు కూడా కలకత్తాలోనే సాగింది. Debjani Modak బెంగాలీ సినిమాల్లో తన కెరీర్ ని స్టార్ట్ చేసింది.
బెంగాలీలో మూడు సినిమాలు, ఏడు సీరియల్స్ లో నటించింది. అలా బెంగాలీ సీరియల్స్ లో నటిస్తున్న సమయంలో తమిళ సీరియల్స్ కూడా చేసింది. తమిళంలో రెండు సీరియల్స్ లో నటించింది. Debjani ఎన్నెన్నో జన్మల బందం సీరియల్ తో telugu బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సీరియల్ తోనే telugu ప్రేక్షకులకు దగ్గర అయింది.