ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అప్పట్లో తెలుగు టాప్ హీరోయిన్..
Tollywood Heroine soundarya :ఒకప్పుడు హీరో హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే, సినీమా వార పత్రికల కోసం ఎదురు చూసేవాళ్ళు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి విషయం ఇప్పుడు నేరుగా ఫాన్స్ కి తెలిసిపోతోంది. సెలబ్రిటీలందరికీ సోషల్ మీడియా ఎక్కౌంట్స్ ఉండడంతో ఎప్పటికప్పుడు హీరో, హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి పిక్స్, వారి బర్త్‌డేల నాడు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ దివంగత అందాల హీరోయిన్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోను ఫాన్స్ వరుసగా షేర్స్ చేస్తున్నారు. ఈమె ఎవరో కాదు అభినవ సావిత్రి అనిపించుకున్న సౌందర్య. సహజ నటిగా తెలుగునాట తన స్టార్‌డమ్‌ను పెంచుకుని, ఎంతోమంది అభిమానుల మనసులు గెలుచుకుంది ఈ లేడీ సూపర్ స్టార్.
పేరుకు కన్నడ అమ్మాయి అయినా, తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించి, తన అందం, అభినయంతో సౌందర్య మెప్పించింది. అందుకే ఆమె మరణించి 17 ఏళ్లు అయినా ఫాన్స్ మదిలో పదిలంగా ఉంది. 12 ఏళ్ళ సినీ కెరీర్‌లో సుమారు 100 సినిమాల్లో నటించి, అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా నిలిచింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న సౌందర్య చిన్న వయస్సులో 2004 ఏప్రిల్ 17న ఈలోకం నుంచి నిష్క్రమించింది.