Healthhealth tips in telugu

పసుపు పుచ్చకాయను ఒకసారి రుచి చూస్తే అసలు వదలరు…ఊహించని ప్రయోజనాలు ఎన్నో …

yellow watermelon Benefits : వేసవి కాలంలో మనం ఎక్కువగా పుచ్చకాయలను తింటూ ఉంటాం. అవి ఎరుపు రంగులో ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో పసుపు రంగు పుచ్చకాయలు వస్తున్నాయి. వీటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎరుపు పుచ్చకాయతో పోలిస్తే పసుపు పుచ్చకాయలో గింజలు తక్కువగా ఉంటాయి.
yellow watermelon Benefits
ఒక కప్పు పసుపు పుచ్చకాయ ముక్కలలో B విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు విటమిన్లు A మరియు C వంటివి సమృద్దిగా ఉంటాయి. విటమిన్ ఎ మరియు కెరోటినాయిడ్ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
gas troble home remedies
విటమిన్ సి అనేది కంటిశుక్లం ఏర్పడకుండా చేస్తుంది. ఫైబర్ మరియు నీటి శాతం ఎక్కువగా ఉండుట వలన జీర్ణ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అధిక బరువుతో బాధపడేవారికి కూడా సహాయపడుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
Immunity foods
పసుపు పుచ్చకాయలలో లభించే విటమిన్ B6 యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇవి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులతో పోరాటం చేస్తాయి. ఈ విటమిన్ ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో కూడా సహాయపడుతుంది. దాంతో శరీరం ప్రోటీన్స్ ని బాగా గ్రహిస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

పసుపు పుచ్చకాయలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరచి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కండరాల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.