బాలయ్య సినిమా 60% షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎందుకు ఆగిపోయిందో అసలు రహస్యం ఇది..
Bala Krishna Movie:తెలుగు తెరపై దాదాపుగా 40 సంవత్సరాల పాటు అలరించిన స్టార్ బాలకృష్ణ. బాలకృష్ణ తగిన పాత్రలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. బాలయ్య కూడా జోరు పెంచి సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తమ కెరీర్ టాప్ రేంజ్ లో ఉన్నప్పుడు సినిమా మొదలు పెట్టి ఆపేసుకున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. బాలకృష్ణ సినిమా ఆగిపోయిందంటే అందరూ నర్తనశాల అని అనుకుంటారు. ఆ సినిమా కాదు. ప్రతాప రుద్రుడు అనే సినిమా. ప్రతాప సింహగా పిలిచేవారు. దానికే ఇప్పుడు నందమూరి అభిమానులు విక్రమసింహ భూపతిగా డిజైన్ చేసుకొని ఆనందిస్తూ ఉంటారు. ఆ సినిమాను నిర్మించింది బాలయ్యకు సన్నిహిత నిర్మాత,టాప్ హీరోగా నిలబడటానికి సహకరించిన భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత గోపాలరెడ్డి.
ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్. ఇందులో భానుమతి కీలకమైన పాత్రను పోషించగా ఆమె మనవడిగా రెండో బాలకృష్ణ నటించారు. దాదాపుగా 60 శాతం షూటింగ్ జరిగిన ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు.
ఈ సినిమా పూర్తి చేసే క్రమంలో గోపాలరెడ్డి అనారోగ్యం పాలయ్యారు. మంగమ్మగారి మనవుడు,మువ్వ గోపాలుడు,ముద్దుల కృష్ణయ్య,ముద్దుల మేనల్లుడు వంటి సినిమాలు తీసిన అయన ఈ సినిమాతో తన కొడుకు భార్గవ్ ని నిర్మాతగా పరిచయం చేసారు.
తన సినిమా మొత్తం నిర్మాణంలో తాను లేకుండా పూర్తి చేయటం ఇష్టం లేని గోపాలరెడ్డి అది అలానే ఆపేసారు. దర్శకుడు కోడి రామకృష్ణ,హీరో బాలకృష్ణ అయన సేంట్ మెంట్ ని కాదనలేక అలానే అంగీకరించారు. ఆలా అనారోగ్యంతో గోపాలరెడ్డి చనిపోవటం జరిగింది. లేదంటే ఆ సినిమా భైరవ ద్విపం సినిమా తర్వాత మరో జానపద సినిమాగా ఉండేది. ఇప్పటికైనా కోడి రామకృష్ణ,భార్గవ బాలయ్యను ఒప్పించి సినిమాను కంప్లీట్ చేయాలనీ ఉందని చెప్పుతూ ఉంటారు.