బీట్ రూట్ తో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయిన తెల్లగా మెరిసిపోతుంది
BeetRoot Face Tips : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ అందం మీద శ్రద్ద పెరిగి ముఖం నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.
బీట్ రూట్ ని చెక్కులు తీసి స్లయిస్ కింద కట్ చేసి దాని మీద పంచదార,గ్లిజరిన్ వేసి బాగా కలిసేలా కలిపి బీట్ రూట్ ముక్కతో ముఖాన్ని రబ్ చేయాలి. ఆ తర్వాత పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. మరొక చిట్కా తెలుసుకుందాం.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల బీట్ రూట్ రసం, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, అరస్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పావుగంట అయ్యాక సాదారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది. బీట్ రూట్ చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది.
చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. చర్మ చాయను మెరుగుపరుస్తుంది. చర్మంలో మచ్చలను తొలగిస్తుంది. అంతే కాదు అనేక రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ముఖంలో మెటిమలు మచ్చలు తొలగిస్తుంది. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఖచ్చితంగా మంచి ఫలితం కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.