‘గుప్పెడంత మనసు’ సీరియల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ …కొత్త సీరియల్ కోసం…
Guppedantha Manasu:గుప్పెడంత మనసు సీరియల్ ఇప్పటివరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది. అయితే ఈ సీరియల్ టైమింగ్ మారనున్నది. ఎందుకంటే ఈ సమయంలో కొత్త సీరియల్ ప్రసారం కానున్నది.
కొత్త సీరియల్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని మే9 సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు ప్రసారం చేస్తామని ప్రోమోలో తెలిపింది. మరి ఇప్పటివరకు ఆ టైమ్ స్లాట్‌లో ‘గుప్పెడంత మనసు’ వస్తుంది. అంటే ఈ కొత్త ధారావాహిక రాకతో రిషిధార టైమ్ మారిపోతుందన్నమాట. ఇదే ఇప్పుడు ఈ సీరియల్ అభిమానులను బాగా హర్ట్ చేస్తుంది.
అయితే గుప్పెడంత మనసు సీరియల్ ఎప్పుడు వస్తుందో ఇంకా చెప్పకపోవటంతో…గుప్పెడంత మనస్సు సీరియల్ అభిమానులు గందరగోళంలో ఉన్నారు. అయితే రెండు రోజుల్లోనే గుప్పెడంత మనస్సు సీరియల్ సమయంపై క్లారిటి వస్తుంది.