MoviesTollywood news in telugu

నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో విక్రమాదిత్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Nuvvu Nenu Prema serial Vikramaditya (swaminathan) Real Life: ప్రతి రోజు టివిలో ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఆ సీరియల్స్ చూసే అభిమానులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షక ఆదరణతో చాలా సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో విక్రమాదిత్య పాత్రలో swaminathan నటిస్తున్నాడు.

బెంగుళూర్ లో పుట్టి పెరిగిన swaminathan చదువు కూడా బెంగుళూర్ లోనే సాగింది. చదువు పూర్తీ అయ్యాక కొంత కాలం ఉద్యోగం చేసాడు. అయితే చిన్నప్పటి నుండి మోడల్ అవ్వాలని కోరిక ఉండటంతో ఆ వైపుగా అడుగులు వేసాడు. swaminathan కి మొదట నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. ఆఫర్స్ రావటంతో నటన వైపు అడుగులు వేసాడు.

2019 లో కన్నడలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో సినిమాలను కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో, తమిళంలో సీరియల్స్ చేస్తున్నాడు. తెలుగులో నువ్వు నేను ప్రేమ సీరియల్, తమిళంలో గుప్పెడంత మనస్సు సీరియల్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇలానే సీరియల్స్, సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీగా ఉండాలని కోరుకుందాం.