విజయ్ దేవరకొండ తండ్రికి పూరి జగన్నాద్ కి ఉన్న లింక్ ఏమిటో తెలుసా…?
Vijay Devarakonda Father:ఒక్కక్కరు ఎంత కష్టపడ్డా సుఖం ఉండదు. అయితే కొందరి హీరోలకు ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చేస్తుంది. అది ఏ రేంజ్ లోకి వెళుతుందంటే, స్టార్ డైరెక్టర్లు కూడా అతని కోసం క్యూ కడతారు. సరిగ్గా ఇప్పుడు పూరి జగన్నాధ్ విషయంలో అదే జరిగింది. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ లు కొట్టిన పూరీ ఈమధ్య అన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఎలాగైనా హిట్ కోసం తపిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న పూరి జగన్నాధ్ ఆతర్వాత విజయ్ దేవరకొండలో తీసి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇండస్ట్రీలో హిట్స్ ఉంటె ఒకలాగ,లేకుంటే మరోలా ట్రీట్ చేయడం మామూలే. అందుకే పడిలేచే కెరటంలా పూరి పలుసార్లు తన సత్తా చాటాడు.
పూరి జగన్నాధ్ ఎవరో కూడా తెలియని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో బద్రి తీసి హిట్ కొట్టాడు. ఆతర్వాత ఓ మోస్తరుగా వెలుగుతూ,మహేష్ బాబుతో పోకిరి తీసి బ్లాక్ బస్టర్ కొట్టి,తానేమిటో రుజువుచేసుకున్నాడు. మళ్ళీ టెంపర్ తో తన పవర్ చూపించాడు. అయితే ఆతర్వాత హిట్స్ లేవు. దీంతో హిట్ కోసం తపిస్తున్న పూరి కంట్లో విజయ్ దేవరకొండ మెదిలాడు.
నిజానికి విజయ్ కూడా కష్టపడి ఎదిగి,స్టార్ హీరో అయ్యాడు. చిన్న చిన్న పాత్రలతో నెట్టుకొస్తూ పెళ్లిచూపులు మూవీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత అర్జున్ రెడ్డి మూవీతో రాత్రికి రాత్రే స్టార్ హీరో అయ్యాడు.
అదే తరహాలో పూరి జగన్నాధ్ కూడా ఓ కథను రెడీ చేసుకుని విజయ్ దగ్గరకు వెళ్లి వినిపించాడట. ఆ సినిమా లైగర్. కాకినాడలో డియర్ కామ్రేడ్స్ షూటింగ్ లో ఉన్న విజయ్ దగ్గరకు అతని తండ్రి గోవర్ధనరావు ని వెంటబెట్టుకుని మరీ వెళ్ళాడట. ఇంతకీ విజయ్ తండ్రితో పూరికి గల సంబంధం ఏమిటంటే,గోవర్ధనరావు దూరదర్శన్ సీరియల్స్ లో నటించేవారట.
అప్పుడు పూరి కూడా దూరదర్శన్ కోసం పలు ప్రోగ్రామ్స్ కూడా రూపొందించాడు. వాటిల్లో గోవర్ధనరావు నటించాడు. ఈవిధంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండడంతో విజయ్ తో మూవీకోసం ఆయన్ని వెంటబెట్టుకుని వచ్చి మరీ కథ వినిపించాడు. అయితే లైగర్ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.