పాలల్లో పసుపు కలిపి తాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు
Turmeric milk Benefits in telugu : మనలో చాలా మంది ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే టాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు అలా ప్రతి చిన్న సమస్యకు టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. వంటింట్లో ఉండే వాటితోనే ఎన్నో రోగాలు నయం చేసుకోవచ్చు.
ప్రతిరోజు పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఒక గ్లాస్ పాలను బాగా మరిగించి గ్లాసులో పోసి దానిలో పావు spoon లో సగం పసుపును వేసి బాగా కలపాలి. ఈ పాలను ప్రతి రోజూ తాగితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. గ్యాస్ ఎసిడిటి, కడుపు నొప్పి వంటి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి.
పసుపులో యాంటీబ్యాక్టీరియల్,యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన దగ్గు జలుబు వంటివి రెండు రోజుల్లోనే తగ్గిపోతాయి.
మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వాపులను తగ్గిస్తుంది ఒత్తిడి ఆందోళన వంటి వాటిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేదెలా చేస్తుంది.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకోవడానికి అరగంట ముందు పసుపు పాలు తాగితే మంచి నిద్ర పడుతుంది.అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మార్కెట్లో దొరికే ప్యాకెట్ పసుపు వాడకూడదు పసుపు కొమ్ములను బాగా కడిగి ఎండబెట్టి పొడిగా చేసుకుని వాడాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.