ఈ పూల టీ త్రాగితే…అధిక బరువు, డయాబెటిస్,తలనొప్పి,నిద్రలేమి వంటి సమస్యలు ఉండవు
Jasmine tea benefits :అది ఇంటి వైద్యం అనండి. సొంత వైద్యం అనండి.. పెద్దలు చెప్పిందని అనండీ ఏది అయినప్పటికీ మనకు ప్రకృతిలో దొరికే ఫల పుష్పాదులతో కొన్ని రకాల వ్యాధులు నయం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మల్లె పూవు. మల్లె పువ్వు చాలా వ్యాధులను నయం చేస్తుందని నిపుణులు చెప్పుతున్నారు.
రాత్రి సమయంలో మల్లె టీ తాగితే మంచి నిద్ర పట్టి నిద్రలేమి సమస్య తగ్గుతుంది. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉండుట వలన జ్వరం నుండి ఉపశమనం కలుగుతుంది. అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్తఃయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తంలోని తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అదుపులో ఉంచే గుణాల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం దరిచేరదు.
శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మల్లెపూల టీ ఎలా తయారుచేయాలో చూద్దాం. తాజా మల్లె మొగ్గలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో ఉంచాలి. ఒక చెంచా టీపొడికి ఏడు రెట్టు అధికంగా మల్లె మొగ్గలు వేయాలి. ఈ నిష్పత్తి కొద్దిగా అటూ, ఇటూ అయినా ఫర్వాలేదు. ఈ నిష్పత్తి 1 :7 గా ఉంటే మల్లెలలోని లక్షణాలు అన్నీ పొందవచ్చు.
వేరొక గిన్నెలో పెద్ద గ్లాసు నీళ్లు వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత మల్లెలు, టీ పొడి వేసి మూత పెట్టి ఆరు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత వడకట్టి బెల్లం లేదా పటికబెల్లం లేదా తేనె కలుపుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేదా పటికబెల్లం లేదా తేనె లేకుండానే తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.