Healthhealth tips in telugu

1 గ్లాస్-వేసవిలో వేడి తగ్గించటమే కాకుండా అలసట,నీరసం,రక్తహీనత లేకుండా చేస్తుంది

Summer Drink : వేసవికాలం ఎండలు బాగా పెరిగిపోయాయి. బయటకు వెళ్ళి వచ్చామంటే అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే వేసవిలో వేడి తగ్గించటంతో పాటుగా అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి లేకుండా చేస్తుంది. అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది.
apple
ఒక Apple, రెండు క్యారెట్స్, ఒక బీట్ రూట్ తీసుకొని శుభ్రంగా కడిగి తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి. ఈ ముక్కలను ఉడికించి మిక్సీ జార్ లో వేసి ఒక కప్పు నీరు,చిన్న పటికబెల్లం ముక్క,ఒక నిమ్మకాయ రసం పిండి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడకట్టి తాగాలి.గ్యాస్ సమస్య లేనివారు ఉడికించకుండా మిక్సీ చేసుకోవచ్చు. .
beetroot juice
ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో హీమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు 15 రోజుల పాటు తాగితే చాలా తేడా కనపడుతుంది. ఆ తేడా చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాకుండా అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి బలపడి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.