నిమ్మకాయతో క్లీనింగ్ సోప్ ఈజీగా చేయొచ్చు… ఎలా…?
Lemon Cleaning Tips :నిమ్మకాయలో ఎన్నో ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు అలాగే క్లీనింగ్ విషయంలో కూడా నిమ్మకాయ చాలా బాగా సహాయపడుతుంది అంటే వంటగదిలో పాత్రలు శుభ్రం చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. కిటికీలు, షింక్ లలో ఉన్న మురికి తొలగి పోవడానికి ఒక గిన్నె నీటిలో ఒక నిమ్మకాయ రసం, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి కాటన్ సాయంతో కిటికీలు తలుపులు తుడిస్తే మురికి అంతా తొలగి పోయి మిలమిల మెరుస్తాయి.
మసాలా కూరలు చేసినప్పుడు జిడ్డు ఒక పట్టాన వదలదు. అప్పుడు నిమ్మరసంలో వెనిగర్ కలిపి పాత్రలను రుద్ది ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది ఆ గిన్నె లకు ఉన్న జిడ్డు మరియు వాసన కూడా తొలగిపోతుంది. కాబట్టి గిన్నెలు తోమడానికి ఖరీదైన క్లీనింగ్ సోప్స్ .వాడాల్సిన అవసరం లేదు ఇలా ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.