వారంలో 2 సార్లు దీన్ని తాగండి.. లివర్ క్లీన్ అవుతుంది.. వ్యర్థాలు బయటకు పోతాయి..!
Black Cumin Seeds Benefits In Telugu: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది ఎక్కువగా జంక్ ఫుడ్స్ తింటున్నారు. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
మారుతున్న జీవనశైలి, తీసుకొనే ఆహారం విషయంలో మార్పులు వంటి కారణాలతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎన్నో హానికరమైన పదార్ధాలు శరీరంలోకి చేరుతున్నాయి. వాటిని లివర్ శుభ్రం చేయటంలో బలహీనంగా మారుతుంది. శరీరాన్ని వ్యర్ధాల నుండి రక్షించటానికి కాలేయం సహాయపడుతుంది. అది కాలేయం యొక్క పని అని చెప్పవచ్చు.
ఈ సమస్యల నుండి లివర్ ని ఎలా కాపాడుకోవాలి. లివర్ లో వ్యర్ధాలు అన్నీ బయటకు పోయి శుభ్రంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను తగ్గించటానికి నల్ల జీలకర్ర చాలా బాగా సహాయపడుతుంది. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు.
నల్ల జీలకర్రలో ఉండే థైమోక్వినోన్ అనేది లివర్ లోని వ్యర్ధాలను బయటకు పంపటమే కాకుండా లివర్ కణాలు పునరుత్పత్తి జరిగేలా ప్రోత్సహిస్తుంది. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ నల్ల జీలకర్ర వేసి అరగ్లాస్ నీరు అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగాలి.
ఈ నీటిని వారం రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. నల్ల జీలకర్ర ప్రస్తుతం విరివిగానే,సులభంగానే అందుబాటులో ఉంటుంది. వారంలో మూడు సార్లు ఈ నీటిని తాగితే చాలా మంచి ఫలితం కనపడుతుంది. అలాగే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. దాంతో బరువు తగ్గుతారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.