ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కార్న్ ఫ్లేక్స్ తింటున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి
corn flakes side effects in Telugu :సాధారణంగా మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కార్న్ ఫ్లేక్స్ తింటుంటారు. పిల్లలే కాకుండా పెద్దవారు కూడా తింటుంటారు. కార్న్ ఫ్లేక్స్ లో పాలు పోసుకొని తినేస్తుంటారు.ఇది చాలా తేలికగా అయిపోయే బ్రేక్ ఫాస్ట్.అందుకే ఎక్కువ మంది ఉదయం సమయంలో కార్న్ ఫ్లేక్స్ తింటుంటారు.
అయితే ఉదయం ఇలా బ్రేక్ ఫాస్ట్ లో కార్న్ ఫ్లేక్స్ తినడం మంచిదేనా అనే విషయానికి వస్తే కార్న్ ఫ్లేక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్న్ ఫ్లేక్స్ అంటే కేవలం మొక్కజొన్న అని అందరూ భావిస్తారు. కానీ దానిలో షుగర్ మాల్ట్ ఫ్లేవరింగ్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వంటివి ఉంటాయి.
అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్యకు కూడా కారణమవుతుంది. దంత సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. మెదడు చురుకుదనం తగ్గుతుంది.
కాబట్టి కార్న్ ఫ్లేక్స్ ఎక్కువగా తీసుకోకుండా వారంలో రెండు నుంచి మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఎక్కువగా తీసుకుంటే అనర్థమే కదా తక్కువగా తీసుకుంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.