వారంలో 2 సార్లు ఇలా చేస్తే చాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,బలంగా పెరగటం ఖాయం
Hair Fall Tips : ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. ఈ సమస్య నుంచి బయట పడటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని ఒక బౌల్ లో వేసి దానిలో ఒక స్పూన్ తేనె కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఒక గంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
జుట్టుకి రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా ఉండేలా చేస్తుంది. శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాటం చేసి చుండ్రు, జుట్టు రాలే సమస్యను, తెల్లజుట్టు సమస్యను తగ్గిస్తాయి. జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గిస్తుంది.
తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండుట వలన జుట్టు కుదుళ్లలో ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా చేయడంతో పాటు చుండ్రు, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తేనె జుట్టుకు నేచురల్ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.