నిమ్మతో ఇలా చేస్తే నల్లని మచ్చలు లేకుండా ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరిసిపోతుంది
Lemon Face Glow Tips : ముఖం అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. అయితే దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది దబ్భును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ పసుపు వేసి దానిలో మూడు స్పూన్లు రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. నిమ్మకాయను సగానికి కట్ చేసి సగం ముక్కను పసుపు,రోజ్ వాటర్ మిశ్రమంలో డీప్ చేసి ముఖానికి రుద్దాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పసుపులో ఉండే లక్షణాలు చర్మం మీద మృత కణాలను తొలగిస్తుంది. నిమ్మలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా చేస్తుంది. రోజ్ వాటర్ అన్నీ చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. రోజ్ వాటర్ మార్కెట్ లో దొరుకుతుంది. అలా కాకుండా ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు.
మార్కెట్ లో దొరికే క్రీమ్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. నిమ్మకాయ,పసుపు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.