భర్తలు విలన్స్ అయితే వాళ్ళ భార్య లు టాప్ హీరోయిన్స్ ….ఎవరో చూడండి
Tollywood Villains With Their Wives:ఓ సినిమా బాగా రక్తి కట్టాలంటే హీరోకి తగ్గ విలన్ ఉండాలి. ఎక్కడా బాలన్స్ తప్పదు. కానీ ఇందులో ఎవరు వీక్ అయినా తేడా కొట్టేస్తుంది. అందుకే హీరోలకు సరిజోడుగా విలన్స్ ని ఎంపిక చేస్తారు. విలన్ పాత్రలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. మరి విలన్స్ గా కొందరు నటులు రాణిస్తుంటే,వాళ్ళ భార్యలు మాత్రం టాప్ అందంతో హీరోయిన్స్ గా వెలిగిపోతారు. ఒకప్పుడు విలన్ కేరక్టర్ కి సరికొత్త అర్ధం ఇచ్చిన రఘువరన్ 1982లో తమిళ మూవీ తో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు,మళయాళం,తమిళ మూవీస్ లో నటించి ఫిలింఫేర్ అవార్డులు ఎన్నో సొంతం చేసుకున్నాడు.
ఇక యితడు చైల్డ్ ఆర్టిస్టు నుంచి సినిమాల్లో నటించిన నటి రోహిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రైటర్ గా, డైరెక్టర్ గా,డబ్బింగ్ ఆర్టిస్టుగా ఈమె రాణించింది. జ్యోతిక,మనిషా కొయిరాలా,ఐశ్వర్య రాయ్,అమల వంటి వాళ్లకు ఈమె డబ్బింగ్ చెప్పింది.
ఇక ఒకప్పటి ఫేమస్ విలన్ అవినాష్ కన్నడ వ్యక్తి. 20 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న యితడు 1600కి పైగా మూవీస్ లో నటించాడు. వైవిధ్యమైన పాత్రలతో రాణించిన యితడు,ఒకప్పటి కన్నడ టాప్ హీరోయిన్ మాళవిక ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె తండ్రి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో చైల్డ్ ఆర్టిస్టు నుంచి సినిమాల్లో వేస్తూ హీరోయిన్ గా ఎదిగింది. మంచి డాన్సర్ కూడా. టివి సీరియల్స్ లో నటిస్తూ,2003లో బీజేపీలో చేరి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఇక అవినాష్, మాళవిక లకు ఓ అబ్బాయ్ ఉన్నాడు.
కాగా ఆశిష్ విద్యార్థి తెలుసుకదా. పోకిరిలో విలనిజం గల పొలిసు ఆఫీసర్ పాత్రలో అదరగొట్టాడు. కన్నడ,తెలుగు,హిందీ,మళయాళం మూవీస్ లో నటిస్తున్న యితడు తెలుగులో 9 సినిమాలే చేసినా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆయన భార్య రాజోష్ విద్యార్థి.
తెలుగు ,హిందీ,కన్నడ, మరాఠీ,ఇంగ్లీషు భాషల్లో నడిచిన కులకర్ణి పేరుకు తగ్గ గొప్ప విలన్. ఆంధ్రావాలా, చంటి,రామ్ సినిమాల్లో నటించిన ఇతడి భార్య కూడా ఓ యాక్టర్. ఆమె పేరు గీతాంజలి కులకర్ణి. వీరికి ఇద్దరు పిల్లలు. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తూ ఫామిలీ ని చూసుకుంటోంది.
రణం సినిమాలో విలన్ వేసిన బిజూ మీనన్ తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. తమిళ,తెలుగు మూవీస్ తో పాటు100మళయాళ చిత్రాల్లో నటించాడు. ఇతడి భార్య పేరు సంయుక్త వర్మ ఒకప్పటి ఫేమస్ మళయాళీ హీరోయిన్. ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిలిం అవార్డులు అందుకుంది. పెళ్లయ్యాక సినిమాలకు దూరం అయింది. వీళ్ళ కొడుకు పేరు దాక్షాదామిన్.
అతిధి, గోపాల గోపాల,కృష్ణం వందే జగద్గురుమ్ వంటి సినిమాల్లో విలన్ గా రాణించిన మురళి శర్మ బాలీవుడ్ , టాలీవుడ్ లలో దుమ్ము రేపుతున్నాడు. టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తున్న భారతీయ నటుడు యితడు. ఇక ఇతడి భార్య అశ్విని కల్ శేఖర్ కూడా హిందీలో అనేక సీరియల్స్ లో నటించిన యాక్టర్. ఇక బదరీనాధ్ మూవీలో ఈమె విలన్ గా చేసింది.