గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్ తులసి గురించి ఈ విషయాలు తెలుసా?
Gruhalakshmi Serial tulasi real name :భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టేలా బుల్లితెరపై వస్తున్న గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షక అభిమానంతో సక్సెస్ గా ముందుకు సాగుతుంది. కుటుంబం కోసం ఓ ఇంటి ఇల్లాలు ఎంతలా కష్టపడుతుందో ఈ సీరియల్ చూస్తే అర్ధం అవుతుంది. ఇందులో మెయిన్ రోల్ వేస్తున్న తులసి అదేనండి కస్తూరి గురించి ఎక్కువ చర్చ నడుస్తోంది.
పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్నప్పటికీ 2010లో మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసింది. 2018లో తమిళ బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చినా సరే,ఈమె వెళ్ళలేదు. అయితే 2009లో వైల్డ్ కార్డు ఎంట్రీతో ఎంటర్ అయింది. ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ ద్వారా తెలుగు వారిని బాగా ఆకట్టుకుంటున్న కస్తూరి రియల్ లైఫ్ లో మోడ్రన్ గా ఉంటుంది. మద్రాసులో 1976 జూన్ 15న జన్మించిన కస్తూరి అసలు పేరు కస్తూరి శంకరి.
కస్తూరి తల్లి సుమతి న్యాయవాదిగా పనిచేయగా, తండ్రి శంకరరావు ఇంజనీరుగా పనిచేసారు. తన స్టడీస్ మొత్తం మద్రాసులోనే పూర్తిచేసిన కస్తూరి కి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే మోడల్ గా,యాంకర్ గా,హీరోయిన్ గా కూడా చేసింది.తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న కస్తూరి తెలుగులో భారతీయుడు,సోగ్గాడి పెళ్ళాం,అన్నమయ్య వంటి ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరుతెచ్చుకుంది. ఇక రవికుమార్ అనే వ్యక్తితో 1990లో కస్తూరికి పెళ్లయింది. ఒక అమ్మాయి,ఓ అబ్బాయి ఉన్నారు.