మధ్యలో ఆగిపోయిన టాప్ హీరోల సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
Tollywood Movies:సినిమా తీయడం అంటే మామూలు విషయం అనుకుంటాం. కానీ నిర్మాతలు నానా కష్టాలు పడాల్సిందే. తమ దగ్గరున్న సొమ్ముని కొంత పెట్టుబడిగా పెట్టి, ఫైనాన్షియర్స్ దగ్గర అధిక వడ్డీకి చే బదులు తీసుకుంటారు. ఒకవేళ సినిమా లేటయినా, ఆగిపోయిన ఇక అంతేసంగతులు. నిర్మాత దెబ్బ తినడం ఖాయం. ఓ మోస్తరు నిర్మాతలైతే ఇలాంటివి తట్టుకోలేరు. తేరుకోలేరు. ఇక మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఎన్నో వున్నాయి. ఇందులో అగ్ర హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే, ఇప్పటికీ కమల్ హాసన్ నటించిన విశ్వరూపం – 2 వంటి చిత్రాలు ఎన్నో రిలీజ్ కి నోచుకోలేదు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో అశ్వినీదత్ అప్పట్లో ఓ సినిమా తలపెట్టారు. ‘వినాలని వుంది’అనే టైటిల్ పెట్టారు. అయితే డైరెక్షన్ లో చిరు వేలుపెట్టడంతో,సహించలేక మధ్యలోనే వర్మ వెళ్ళిపోయాడట. దీంతో ఆ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అయితే జైలు నుంచి వచ్చిన సినిమాకోసం వర్మ మధ్యలోనే ముంబయ్ వెళ్లిపోయాడని,దాంతో మూవీ ఆగిందని కారణంగా చూపినట్లు చెబుతారు.
ఇక చిరుతోనే హాలీవుడ్ తో సహా హిందీ,తెలుగు,తమిళం,ఇలా పలు భాషల్లో ఓ చిత్రం ప్లాన్ చేశారట.
అబూ బాగ్దాద్ గజదొంగ గా టైటిల్ పెట్టారట. కొంత షూటింగ్ అయ్యాక ఆగిపోయింది. ఇక ఈ సినిమా పుర్తయివుంటే, బాహుబలి సృష్టించిన ప్రభంజనం చిరు అప్పట్లోనే సొంతం చేసుకునేవాడిని అంటారు. మరోపక్క జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా బంపర్ హిట్ కొట్టడంతో అదే తరహాలో భూలోక వీరుడు పేరిట సైన్స్ ఫిక్షన్ తో సినిమా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో చేసారు. అయితే అవుట్ ఫుట్ సరిగ్గా లేదని చిరు అభ్యంతరం చెప్పడంతో సినిమా విడుదల పూర్తిగా ఆగిపోయింది.
మరో అగ్ర హీరో బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ సెట్స్ వేసి, మొదలుపెట్టిన ‘నర్తనశాల’ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. ఉదయ కిరణ్ అభిమన్యుడిగా నటించాల్సిన ఈ సినిమాలో ద్రౌపది పాత్ర ధారి సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. అదేవిధంగా బి గోపాల్ డైరెక్షన్ లో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా,బాలయ్య హీరోగా మొదలుపెట్టిన హరహర మహాదేవ మూవీ కూడా ఆగిపోయింది.
అలాగే బాలయ్యతో ఎన్నో సినిమాలు తీసిన భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మాతగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ‘విక్రమ సింహ భూపతి’పేరిట ఓ భారీ జానపద చిత్రం ప్లాన్ చేసారు. కోట్లాది రూపాయలతో సెట్స్ వేసి మరీ షూటింగ్ చేసారు. అయితే బాలయ్యకు , కోడి రామకృష్ణకు విభేదాలు రావడంతో బాలయ్య ఆ సినిమా ఆపేసాడు.
ఆతర్వాత మరో కొత్త దర్శకుణ్ణి బాలయ్య సిఫార్స్ చేయడంతో అక్కడ వేసిన సెట్స్ పనికిరావని చెప్పాడు. దీంతో కొత్త దర్శకుని సూచనతో మళ్ళీ కోట్లు వెచ్చించి సెట్స్ వేశారు. అయితే సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అప్పుల బాధ తట్టుకొలేక నిర్మాత గోపాలరెడ్డి మరణం వరకూ దారితీసింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన జానీ సినిమా తర్వాత సూర్య మూవీస్ పతాకంపై ఏ ఎం రత్నం డైరక్షన్ లో సత్యాగ్రహి చిత్రం మొదలుపెట్టి ఆపేసారు.
ఇక తరుణ్, రిచా జంటగా విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన నువ్వేకావాలి మూవీ సూపర్ హిట్ అయింది. అయితే ఇదే సినిమాను అంతకు ముందు ‘చెప్పాలని ఉంది’ టైటిల్ తో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా షూటింగ్ చేసినా , ఎందుకో ఆగిపోయింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో భారీ చిత్రాల నిర్మాత కొండా కృష్ణం రాజు తన బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఏసుక్రీస్తు గా నటించేలా జెరూసలేం,బెత్లెహాం లో షూటింగ్ కూడా ప్రారంభించి, ‘పీస్ ఆఫ్ పీస్’ అనే ఆంగ్ల టైటిల్ నిర్ణయించారు. మరి ఎందుకో ఈ సినిమా ఆగిపోయింది.
పవన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కోమలి అనే టైటిల్ ప్రకటించారు. అది కూడా ఆగిపోయింది. అలాగే పవన్,వినాయక్;పవన్ ,లారెన్స్ ల కాంబినేషన్ లో మూవీస్ ప్రకటించినా, ఎందుకో ఆగిపోయాయి. విక్టరీ వెంకటేష్ డైరెక్షన్ లో వంశీ డైరక్షన్ లో గాలిపురం రైల్వే స్టేషన్ మూవీ మొదలు పెట్టారు. భానుప్రియ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. కోట శ్రీనివాసరావు,వెంకటేష్ తదితరులపై కొన్ని సీన్స్ తీసాక సినిమా ఆగిపోయింది.
కాగా అప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఉదయకిరణ్ మూవీస్ కూడా ఎన్నో ఆగిపోయాయి. ఏ ఎం రత్నం డైరెక్షన్ లో ‘ప్రేమంటే సులువు కాదురా’ మూవీ 50శాతం పైనే షూటింగ్ జరిగి కూడా ఆగిపోయింది. దీనికి తోడు బాలయ్య తీయాల్సిన నర్తనశాల మూవీలో అభిమన్యుడు పాత్ర ఉంటుందనుకుంటే అదీ ఆగిపోయింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్ బి చౌదరి నిర్మాతగా ఉదయ్ ,సదా జంటగా రావాల్సిన లవర్స్ మూవీ కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది.
అలాగే బాలీవుడ్ హిట్ మూవీని ఉదయకిరణ్ హీరోగా మొదలై ఆగిపోయింది. ఇక చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ మిలట్రీ ఆఫీసర్ గా ప్రారంభమైన మూవీ అమెరికా, లండన్ లలో చిత్రీకరణ చేసుకున్నాక మధ్యలోనే ఆగిపోయింది. ఇదికాకుండా సుమన్,కోడి రామకృష్ణ కాంబినేషన్ లో పలు చిత్రాలు షూటింగ్ జరుపుకుని కూడా గాల్లో కలిసిపోయాయి.