అర స్పూన్ పొడి ఇలా తీసుకుంటే చాలు డయాబెటిస్ తగ్గటమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా ఉండదు
jack fruit powder Benefits In Telugu : మారిన జీవనశైలి, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక కారణాలతో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిల్లో అధిక బరువు, డయాబెటిస్ అనేవి చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చెప్పే పొడి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే దాన్ని తగ్గించుకోవటం చాలా కష్టం. అలాగే జీవితకాలం మందులు వాడాల్సిందే. డయాబెటిస్ రాకముందు జీవనవిధానం ఒకలా ఉంటే డయాబెటిస్ వచ్చాక జీవన విధానం మరోలా ఉంటుంది. ఎందుకంటే ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది.
డయాబెటిస్ వచ్చినప్పుడు కంగారు పడకుండా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే పొడిని తీసుకుంటే డయాబెటిస్ అనేది నియంత్రణలో ఉంటుంది.
పనస కాయ పొడి డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచటంలో చాలా బాగా సహాయపడుతుంది. గ్లైసెమిక్ ను నియంత్రించి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. ఇన్సులిన్ యాక్టివ్ గా పని చేసేటట్టు చేస్తుంది. రక్తంలోకి చక్కెర వెళ్ళకుండా కంట్రోల్ చేస్తుంది.
పనసకాయ పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు. పచ్చి పనస కాయని ముక్కలుగా కట్ చేసి బాగా ఎండపెట్టాలి.ముక్కలు బాగా ఎండిన తర్వాత పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని అర స్పూన్ ప్రతి రోజు తీసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. లేదా అట్లు లేదా చపాతీ వంటి వాటిలో కలిపి తినవచ్చు.
ఈ పొడిని కూరల్లో వేసుకొని కూడా తినొచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. పనస పొడిలో ఐరన్ సమృద్దిగా ఉండటం వల్ల.. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఈ పొడిలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.