నేరేడు పండ్లు తిన్న తర్వాత నీటిని తాగితే ఏమి అవుతుందో తెలుసా?
Jamun Benefits In telugu : నేరేడు పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయి.ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, పిండి పదార్థాలు, మాంసకృతులు, calcium, పాస్పరస్, ఐరన్ వంటివి సమృద్దిగా ఉంటాయి. వీటిని సరైన కాంబినేషన్ లో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
అయితే నేరేడు పండ్లను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే కొన్ని ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయి. నేరేడు పండు తింటే శరీరంలో ఉన్న మలినాలను తొలగిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మెదడుకు, గుండెకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కాలేయ పనితీరును మెరుగుపరిచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చాలా మంది నేరేడు పండ్లు తిన్న తరువాత నీటిని తాగుతూ ఉంటారు. నేరేడు పండ్లు తిన్న తర్వాత నీటిని తాగితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలా తాగితే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అయితే నేరేడు పండ్లు తిన్న అరగంట తర్వాత నీటిని తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఖాళీ కడుపుతో కూడా నేరేడు పండ్లను తినకూడదు. నేరేడు పండ్లు రుచిలో పుల్లగా ఉండుట వలన…ఖాళీ కడుపుతో తింటే గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అదే భోజనం అయిన తర్వాత తీసుకుంటే జీర్ణ ప్రక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది. అలాగే నేరేడు పండ్లను తిన్న తర్వాత పాలు మరియు పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
నేరేడు పండ్లను తిన్న తర్వాత పాల ఉత్పత్తులను తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పి వంటి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. నేరేడు పండ్లు ఏ సమయంలో తింటే మంచిది…అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. ఖాళీ కడుపుతో కాకుండా రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు.
ముఖ్యంగా భోజనం తర్వాత ఈ పండ్లను తింటే జీర్ణ ప్రక్రియ వేగవంతంగా జరగడానికి సహాయపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.