డయాబెటిస్ ఉన్నవారు బెండకాయ తింటే ఏమి అవుతుందో తెలుసా?
Bendakaya for diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ నియంత్రణకు తీసుకొనే ఆహారం కీలకమైన పాత్రను పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు బెండకాయ తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. బెండకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బెండకాయ జిగురుగా ఉంటుందని మనలో చాలా మంది తినటానికి ఆసక్తి చూపరు. అయితే ఇప్పుడు చెప్పే విషయాలు తెలుసుకుంటే తప్పకుండా తినటం అలవాటు చేసుకుంటారు. బెండకాయను వేపుడుగా కాకుండా కూర,సలాడ్ రూపంలో తీసుకోవాలి. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి చక్కెర నియంత్రణలో చాలా చురుగ్గా పనిచేస్తాయి.
అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం,కరిగే, కరగని ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చక్కెరలను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. భోజనం చేశాక జీర్ణక్రియను ఆలస్యం చేసి కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మది చేస్తాయి. బెండకాయలో మైరిసెటిన్ అనే సమ్మేళనం ఉండుట వలన చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
అలాగే బెండకాయలో ఉండే ఒలినోలిక్ యాసిడ్, బీటా సిస్టోస్టెనాల్, మైరిసెటిన్, కెంప్ఫెరోల్ అనే సమ్మేళనాలు కూడా చక్కెర నియంత్రణపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. బెండకాయను వారంలో రెండు లేదా మూడు సార్లు తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.