సినిమా పిచ్చితో ఈ స్టార్స్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం
Tollywood Stars News:సినిమా అంటే మోజుతో కొందరు హీరోలు ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరు. ఒక్కోసారి డూప్ లేకుండా నిజంగానే కొందరు యాక్ట్ చేస్తారు. సినీ పరిశ్రమలో ఇలాంటి సన్నివేశాలు తొలినుంచి వరల్డ్ వైడ్ గా సినీ ఇండస్ట్రీలో కనిపిస్తాయి. దీనివలన కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో ఎన్టీఆర్ ఎద్దుతో పోరాడి, గాయాలవ్వడం చూపించారు కూడా. ఇలా రిస్క్ చేయడం వలన గాయపడి కొన్నాళ్ళు షూటింగ్ కి కూడా దూరంగా ఉన్నట్లు కూడా చూపించారు.
జాకీ చాన్ ఇలా డూప్ లేకుండా చేస్తూ చాలాసార్లు గాయపడ్డాడు. అంతేకాదు జాకీ టీమ్ మొత్తం రిస్క్ చేయడం వలన వీళ్లెవరికీ ఇన్సూరెన్స్ చేయడానికి బీమా సంస్థలు ముందుకు రావడం లేదు. ఇక జాకీ చేసిన సినీ రిస్క్ ల వలన సర్జరీ జరగని ప్లేస్ అతడి బాడీలో లేదట.
అలనాటి నటి విజయలలిత కు గుర్రపుస్వారీ అంటే చాలా పిచ్చి . సినిమాల్లో ఆమె గుర్రపు స్వారీ స్వయంగా చేసేది. రౌడీ రాణి సినిమా షూటింగ్ మధుమలై యార్కాడ్ లో చేసారు. అక్కడ గుర్రం పై వస్తూ టర్న్ తీసుకోవాల్సి ఉంటే , గుర్రం ఆగక పోవడంతో 80అడుగుల లోయలో పడిపోబోయింది. అయితే ఆమె పడిపోయి చనిపోయినట్లు ఇంటికి వార్త వెళ్లడం,ఆమె తల్లి స్పృహ తప్పి పడిపోవడం అయింది. కానీ ప్రమాదం నుంచి తప్పించుకుని ట్రంకాల్ బుక్ చేసి, ఇంటికి మాట్లాడాక తల్లి కోలుకుందట.
నటుడు నరేష్ కూడా తన తల్లి డైరెక్షన్ లో రెండు కుటుంబాల కథ షూటింగ్ సమయంలో ప్రమాదం బారిన పడ్డాడు. కొత్తగా ఆర్ ఎక్స్ 100బైక్ కొత్తగా వచ్చిన రోజులు. ఆ బైక్ పై 20అడుగుల గాల్లోకి ఎగిరే షాట్ తీస్తున్నారు. ఆ సమయంలో బైక్ వదిలి నరేష్ పడిపోవడంతో వొళ్ళంతా రక్తం కావడంతో కారులో విజయనిర్మల హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మూడునెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.
కాగా రమ్యకృష్ణ 17వ ఏట ముతల్ వసంత్ తమిళ సినిమా షూటింగ్ లో అరుణ్ పాండ్యన్ తో కల్సి చేసింది. షూటింగ్ గ్యాప్ లో రమ్యకృష్ణ గదిలోకి మెట్లు ఎక్కబోయింది. అయితే ఆ మెట్లు సెట్ గా వేశారని తెలియక 15అడుగుల పైనుంచి జారిపడి కాలి మడమ విరిగిపోయింది. రమ్యకృష్ణ ఆ ఇన్సిడెంట్ తో రెండు సినిమా ఛాన్స్ లు కోల్పోయింది. ఎందుకంటే మూడు సర్జరీలతో రెస్ట్ లోకి వెళ్లాల్సి వచ్చింది.
ఇక నటుడు గోపీచంద్ విషయం తీసుకుంటే,ఓ సినిమా షూటింగ్ లో గాయాలయ్యాయి. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో మొదటి షెడ్యూల్ రాజస్తాన్ లో ప్లాన్ చేశారట. బైక్ డ్రైవ్ సీన్ లో వేగంగా నడిపి,బైక్ స్కిడ్ అయి,గాయపడ్డాడు. పెద్దగా గాయాలు అవ్వకపోయినా అవి తగ్గేవరకూ షూటింగ్ వద్దని రాజస్థాన్ డాక్టర్స్ చెప్పారట.
బామ్మ మాట బంగారు మాట షూటింగ్ లో రెండు కాళ్ళు పోగొట్టుకున్న నూతన ప్రసాద్ కెరీర్ పై ఆ ప్రభావం పడింది. ఏవో అడపా దడపా తప్ప పెద్దగా ఆయనకు ఛాన్స్ లు రాలేదు.