Healthhealth tips in telugu

1 స్పూన్ గింజలు తింటే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…ప్రోటీన్ లోపం అనేది ఉండదు

Proteins rich food for vegetarians : ప్రోటీన్స్ మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రోటీన్ అవసరం. రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం అనేది మన బరువును బట్టి ఉంటుంది. నాన్ వెజ్ తినే వారైతే గుడ్లు., చికెన్, చేపల నుంచి ప్రోటీన్ సమృద్ధిగా అందుతుంది. .అదే శాఖాహారులకు అయితే ప్రోటీన్ అందటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి.
Peanuts Health benefits in telugu
ప్రోటీన్ అనేది జీవక్రియ పనితీరుకు, రోగ నిరోధక శక్తి పెరగటానికి, కండరాలు, ఎముకలు దృఢంగా ఉండటానికి, శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని సరి చేయటానికి ప్రోటీన్ సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరంలో వివిధ భాగాలకు ఆక్సిజన్ అందించటానికి ప్రోటీన్స్ కీలకమైన పాత్రను పోషిస్తాయి. అలాగే రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
peanuts side effects
వేరుశనగల్లో ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. వేరుశనగలను ప్రోటీన్ పవర్ హౌస్ అని చెప్పవచ్చు. ఇతర నట్స్ తో పోలిస్తే వేరుశనగలలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. అర్జినైన్ అనే ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ప్రతి రోజు ఒక స్పూన్ వేరుశనగలను ఉడికించి లేదా నానబెట్టి తీసుకోవచ్చు.
chickpeas in telugu
శనగల్లో కూడా ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే 18% ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. శనగల్లో లైసిన్, అర్జినైన్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు ఒక స్పూన్ శనగలను నానబెట్టి తినవచ్చు. నానబెట్టిన శనగలతో బెల్లం కలిపి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు.

పెసల్లో కూడా ప్రోటీన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే పెసలు చాలా త్వరగా జీర్ణం అవుతాయి. వీటిలో ఫెనిలాలనైన్, లూసిన్, ఐసోలూసిన్, వాలైన్, లైసిన్, అర్జినైన్ వంటి ముఖ్యమైన అమైనో ఆసిడ్స్‌ పుష్కలంగా ఉన్నాయి.మొలకెత్తిన పెసలను తినవచ్చు. వీటిని తింటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. రోజుకి ఒక స్పూన్ గింజలను నానబెట్టి తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.