ఇది తాగితే 20 ఏళ్లుగా ఉన్న థైరాయిడ్ సమస్య శాశ్వతంగా మాయం అవుతుంది
Thyroid In Telugu : థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ను విడుదల చేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఎక్కువగా విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపి, శారీరక క్రియలను నియంత్రిస్తుంది.
ఈ గ్రంథి పని తీరులో తేడాల వల్ల హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం లాంటి సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
మిక్సీ జార్ లో ఒక కప్పు శుభ్రంగా కడిగి కట్ చేసిన కొత్తిమీర, మూడు మిరియాలు, చిటికెడు సైందవ లవణం,అరకప్పు నీటిని పోసి మెత్తగా పేస్ట్ చేయాలి. దీనిలో మరొక అర కప్పు నీటిని పోసి బాగా కలిపి గ్లాసు లోకి వడకట్టాలి. ఈ కొత్తిమీర రసంలో అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఈ కొత్తిమీర రసాన్ని ఉదయం పరగడుపున తాగాలి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఈ కొత్తిమీర రసం తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.