MoviesTollywood news in telugu

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ స్థాయికి రావటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? నమ్మలేరు

Trivikram Srinivas Unknown facts:తన మాటల తూటాలతో, పంచ్ డైలాగులతో,అద్భుత పిక్చరైజేషన్ తో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేసే డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు గా అందరూ అభివర్ణిస్తారు. సైన్స్ సబ్జెక్ట్ లో పిజి చేసి కూడా సాహిత్యంపై మమకారంతో తన ప్రయాణానికి సినిమా పరిశ్రమే సరైన వేదికగా భావించి ఈ రంగాన్ని ఎంచుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవరం మండలం తోలేరు గ్రామంలో పుట్టిన త్రివిక్రమ్ ఆంద్ర యూనివర్సిటీ నుంచి న్యూక్లియో ఫిజిక్స్ లో పిజి చేసి, గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. ఈయన తండ్రి పేరు ఉదయ భాస్కరరావు,తల్లి లక్ష్మి నరసింహమ్మ. భీమవరం డి ఎన్ ఆర్ కాలేజీలో డిగ్రీ చేసే రోజుల్లో కమెడియన్ సునీల్ కూడా అక్కడే చదివాడు.

వారి మధ్య ఏర్పడ్డ ఆనాటి ఫ్రెండ్ షిప్ ఇద్దరినీ హైదరాబాద్ కి చేర్చింది. సాహిత్యాన్ని ఈరోజుల్లో పెద్దగా ఎవరూ పట్టించుకోరని తెలుసుకున్న త్రివిక్రమ్ అదే ఆయుధంగా ఎంచుకున్నాడు. సినిమాల్లో ఎవరూ తెలియక పోవడంతో పొట్టకూటికోసం కమెడియన్ గౌతంరాజు పిల్లలకు ట్యూషన్స్ చెప్పడం మొదలు పెట్టాడు. అలా గౌతంరాజు ఇంటికి వెళ్లడం వలన సినీ ప్రముఖులతో మెల్లిగా సంబంధాలు ఏర్పడ్డాయి. సునీల్ కూడా సినిమా వాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు.

అదే సమయంలో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ గా చేరే ఛాన్స్ లభించింది. అలా ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ స్వయంవరం,చిరునవ్వుతో చిత్రాలకు మాటలు రాయడం,అవి సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీకి మంచి రైటర్ వచ్చాడని అందరూ భావించారు. ఇక ఎప్పటికైనా గొప్ప డైరెక్టర్ అవ్వాలనే తపన త్రివిక్రమ్ లో ఉండేది. దాంతో నువ్వే నువ్వే మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Actors and Directors Best Combination in Tollywood
ఆ తర్వాత అతడు,జల్సా,అత్తారింటికి దారేది, జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి,,అ ఆ వంటి చిత్రాలతో దూసుకుపోయాడు. స్వయంగా రాజమౌళి గొప్పతనాన్ని త్రివిక్రమ్ గొప్పతనాన్ని మెచ్చుకున్నాడు. పక్కా కమర్షియల్ మూవీ మనసు పెట్టి తీస్తే,తమలాంటి వాళ్ళు ఇండస్త్రీలో ఉండలేమన్న రీతిలో రాజమౌళి అన్నాడు.

కాగా హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగం దగ్గరలోనే ఓ చిన్న రూమ్ ని అద్దెకు తీసుకుని అక్కడే కమెడియన్ సునీల్,మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ లతో కల్సి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికీ ఆ రూమ్ కి రెంట్ కడుతూనే ఉన్నాడు. ఇండస్త్రీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్న తొలినాళ్లలో ఆ గదిలోనే ఉన్నాడు. గత ఇరవై ఏళ్లుగా ఎలాంటి మార్పు లేకుండా ఆ రూమ్ అలానే ఉంది. అద్దె కడుతున్నా అక్కడ ఎవరు ఉండరు. అదే సెంటిమెంట్.