ఈ జ్యూస్ 15 రోజులు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య జీవితంలో ఉండదు
Anemia home remedies in ayurveda : రక్తహీనత అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తోంది. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు అలసట, నీరసం, చర్మం పాలిపోవడం, జుట్టు రాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి అనేక రకాల లక్షణాలు కనబడతాయి. పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకుంటే రక్తహీనత సమస్యకు చెక్ పెట్టవచ్చు. రక్తహీనత సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది మందులు వాడేస్తూ ఉంటారు.
సమస్య తీవ్రంగా ఉంటే మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే జ్యూస్ తీసుకుంటే చాలా తొందరగా ఆ సమస్య నుంచి బయటపడతారు. అలా కాకుండా సమస్య తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ జ్యూస్ తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ఈ డ్రింక్ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక యాపిల్ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత చిన్న కీరా దోసకాయ తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, కీర ముక్కలు, ఐదు లేదా ఆరు పాలకూర ఆకులు, 4 గింజ తీసిన ఖర్జూరాలు, ఒక కప్పు నీటిని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ కొబ్బరినీళ్లు, ఒక స్పూన్ తేనె కలిపితే జ్యూస్ తయారైనట్టే.
ఈ జ్యూస్ ని ప్రతిరోజు తాగితే 15 రోజుల్లోనే రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరానికి అవసరమైన ఐరన్ సమృద్ధిగా అందితే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వలన అలసట, నీరసం, నిస్సత్తువ తొలగిపోయి రోజంతా హుషారుగా పనులను చేసుకుంటారు.
అంతే కాకుండా ఈ జ్యూస్ ని డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు తేనే లేకుండా ఈ జ్యూస్ ని అరగ్లాసు మాత్రమే తీసుకోవాలి. అధిక బరువును కూడా తగ్గిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ జ్యూస్ తయారుచేసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.